‘అద్దె గర్భం’తో మహేష్ బాబు హీరోయిన్.. చాలా ఎక్సైటింగ్‌గా ఉందని ట్వీట్
బాలీవుడ్ అందాల తార కృతి సనన్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అద్దె గర్భం కథా నేపథ్యంగా రూపొందుతున్న మిమి అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌ో రూపొందిన 1 నేనొక్కడినే చిత్రం ద్వారా కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇటీవల విజయవంతమైన లుకా చుప్పీ సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై కృతి గంపెడు ఆశలు పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

మిమి గురించి చెప్పినప్పుడు
మిమి అనే సినిమా కథ అత్యంత భావోద్వేగమైనది. కథ చెప్పినప్పుడు ఒకింత ఎక్సైటింగ్‌గా, కొంత నెర్వస్‌గా ఫీలయ్యాను. ఇప్పటి వరకు నేను చేయనటువంటి పాత్ర నాకు లభించింది. అనేక రకాల ఎమోషన్స్ పలికించే చిత్రంగా భావిస్తున్నారు. అంతేకాకుండా నటిగా నాకు ఛాలెంజ్ అని కృతిసనన్ పేర్కొన్నాను.

హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా
మిమి సినిమా నటిగా నాకు బాధ్యతను నేర్పే సినిమా. నేను కొత్తగా, విభిన్నమైన పాత్రలు ధరించాలని ఆలోచిస్తున్నపుడు నాకు ఆ పాత్ర లభించింది. అలాగే ఎన్నో ఏళ్లుగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటించాలని చూస్తున్నాను. ఆ క్రమంలో నాకు ఈ పాత్ర, సినిమా లభించడంతో చాలా సంతోషంగా ఉన్నాను అని కృతి సనన్ తెలిపారు.

జీవిత ప్రయాణం ఊహించనిది
మిమి సినిమా గురించి కృతి సనన్ స్పందిస్తూ.. లైఫ్ అనేది ఊహించని అద్భుతాలతో సాగే ఓ ప్రయాణం. ఇంతకు ముందెన్నడూ లేని ప్రయాణానికి గెట్ రెడీ అవుతున్నాన. ఇది నాకు అత్యంత ప్రత్యేకమైనది. నా హృదయానికి దగ్గరైన సినిమా అంటూ కృతి సనన్ ట్వీట్ చేశారు.

మిమి ప్రత్యేకమైనది
మిమి సినిమా గురించి కృతి సనన్ తెలియజేస్తూ.. ఈ సినిమా నవ్విస్తుంది. ఏడిపిస్తుంది? ఫీల్‌గుడ్ ఎమోషన్స్ పలికిస్తుంది. అన్ని రకాల భావోద్వేగాన్ని పండిస్తుంది. దర్శకుడు లక్ష్మణ్ సార్ ఎమోషన్స్‌ను వినోదాత్మకంగా తెరపైన చెబుతున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడు ఓ చక్కటి అనుభూతిని పొందుతారు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











