బ్రేకప్ రూమర్లపై కృతి సనన్ క్లారిటీ.. ఒక్క ఫోటోతో మారిన కథ!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో బిజీబిజీగా మారింది. ఇటీవల ఈ అమ్మడు నటించిన 'కాక్‌టెయిల్ 2'సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుండగా.. మరోవైపు ఆమె లవ్ లైఫ్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కబీర్ బాహియా తో కృతి ప్రేమలో ఉన్నారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే ఇటీవల ఇద్దరూ విడిపోయారనే రూమర్లు కూడా వచ్చాయి. అయితే.. తాజాగా కృతి షేర్ చేసిన ఒక ఫోటో ఆ బ్రేకప్ ప్రచారానికి చెక్ పెట్టిందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

కృతి సనన్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాఫ్ ఇయర్లీ డంఫ్ (Half Yearly Dump) పేరుతో గత ఆరు నెలల్లో తన జీవితంలో జరిగిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో కుటుంబ సభ్యులు, సోదరి నుపూర్ సనన్, విదేశీ పర్యటనలు, స్నేహితులు, అలాగే తన 'కాక్‌టెయిల్ 2' కో-స్టార్ రష్మిక మందన్న తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆల్బమ్‌లో స్పెషల్ ఆట్రాక్షన్ గా నిలిచింది ఒక్క ఫోటో మాత్రమే. అదే కబీర్ బాహియాతో కలిసి ఉన్న ఫోటో. ఒక లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌లో ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని దిగిన ఫోటో కనిపించింది. ఈ ఫోటోతో అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది.

Kriti Sanon Shares Kabir Bahia Photo Amid Breakup Rumours

బ్రేకప్ రూమర్లకు ఇదే సమాధానమా?
కొద్ది రోజుల క్రితం కబీర్ బాహియా మరో యువతితో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కృతి-కబీర్ మధ్య బ్రేకప్ జరిగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే పలు కథనాల ప్రకారం.. కబీర్‌కు సన్నిహిత వర్గాలు ఆ ప్రచారాన్ని పూర్తిగా ఖండించాయి. వైరల్ అయిన ఫోటోలో కనిపించిన యువతి కబీర్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలని, ఆమెను ఆయన సోదరిలా భావిస్తారని వెల్లడించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని కూడా పేర్కొన్నట్లు కథనాలు తెలిపాయి.

ఇలాంటి సమయంలోనే కృతి స్వయంగా కబీర్‌తో ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో, వీరిద్దరూ ఇంకా రిలేషన్‌లోనే ఉన్నారనే చెప్పడానికి ఊతమిచ్చినట్టు అయింది. కబీర్‌తో ఉన్న ఆ ఫోటోలో ఆయన షేర్వాణీలో కనిపించగా, కృతి మాత్రం బ్లాక్ హుడీలో క్యాజువల్ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ ఫోటో ఏదైనా పెళ్లి వేడుకలో తీసిందా? లేక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? అనే కొత్త చర్చ కూడా మొదలైంది. అయితే ఈ విషయంలో కృతి లేదా కబీర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల పెళ్లి వార్తలను ఇప్పటికైతే కేవలం సోషల్ మీడియా ఊహాగానాలుగానే చూడాలి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కృతి సనన్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. సంబంధాలపై బహిరంగంగా మాట్లాడేందుకు తాను ఆసక్తి చూపనని స్పష్టం చేశారు. నాకు పెళ్లి అయిన తర్వాతే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతాను. కొన్ని విషయాలు నాకు, నా కుటుంబానికే పరిమితం కావాలి" అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో తన రిలేషన్‌షిప్‌ను గోప్యంగా ఉంచాలనే ఉద్దేశం స్పష్టమవుతోంది. కృతి సనన్-కబీర్ బాహియా రిలేషన్ గురించి ఇప్పటివరకు ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కృతి షేర్ చేసిన తాజా ఫోటోతో బ్రేకప్ రూమర్లకు కొంతవరకు చెక్ పడినట్టే కనిపిస్తున్నప్పటికీ, వారు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారనే నిర్ధారణ మాత్రం లేదు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కృతి సనన్ కెరీర్ కూడా పీక్స్ లో ఉంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్నతో కలిసి నటించిన 'కాక్‌టెయిల్ 2'బాక్సాఫీస్ వద్ భారీ వసూళ్లు అందుకుంటుంది.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 12 రోజుల్లో మొత్తం ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.86.75 కోట్లకు,ఇండియా గ్రాస్ రూ.103.45 కోట్లకు చేరాయి. ఇక ఓవర్సీస్ గ్రాస్ రూ.28.45 కోట్లకుచేరుకుంది. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.131.89 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలా సినిమా విజయంతో పాటు ఇప్పుడు ఆమె లవ్ లైఫ్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X