ప్రభాస్ తో పెళ్లి.. మరొక హీరోతో డేట్.. స్టార్ హీరోయిన్ షాకింగ్ ఆన్సర్స్!
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ స్టార్ హీరోయిన్ గా ప్రస్తుతం భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటోంది. ఢిల్లీకి చెందిన ఈ భామ మొదట తెలుగు సినిమాతోనే వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ఈ బ్యూటీ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అయితే ఈ బ్యూటీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ హీరోలపై ఎవరు ఊహించని విధంగా స్పందించింది. డేట్ కు వెళ్లడం దగ్గర నుంచి పెళ్లి చేసుకునే వరకు తనకు ఇష్టమైన హీరోలపై ఉన్న అభిప్రాయాన్ని చాలా ఓపెన్ గా చెప్పేసింది. అందులో ప్రభాస్ పేరును కూడా ప్రత్యేకంగా తెలిపింది.

డిజాస్టర్ అయినప్పటికీ..
2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వన్ నేనొక్కడినే సినిమా ద్వారా కృతి సనన్ వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయినప్పటికీ కూడా ఆమెకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. కానీ ఆమె ఎందుకో ఆ తర్వాత తెలుగు సినిమాలను చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపలేదు. ఎక్కువగా బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది.

రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా కూడా..
చిన్న పెద్ద తేడా లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో యువ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీకి కొన్ని సినిమాలు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. అయితే సక్సెస్ రేట్ ఎక్కువైన అనంతరం కృతి సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది. ఏ మాత్రం రిస్క్ చేయకుండా కేవలం తనకు మాత్రమే సెట్టయ్యే పాత్రలను సెలెక్ట్ చేసుకుంది. అదే తన కెరీర్ కు మేజర్ ప్లస్ పాయింట్ అని ప్రస్తుతం చెప్పుకుంటూ వస్తోంది. పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా కూడా పర్వాలేదని కూడా తెలిపింది.

కార్తిక్ ఆర్యన్ తో అలా..
ఇక రీసెంట్ గా ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ యువ హీరోలపై ఉన్న అభిప్రాయాన్ని చాలా ఓపెన్ గా చెప్పేసింది. అయితే అందులో డేట్ కి ఎవరితో వెళ్తారు? పెళ్లి ఎవరిని చేసుకుంటారు? ఎవరిని ఫ్లర్ట్ చేస్తారు? అనే ప్రశ్న పై అమ్మడు విభిన్నమైన హీరోలను సెలెక్ట్ చేసుకుంది. ముందుగా ఫ్లట్ చేయాల్సి వస్తే కార్తిక్ ఆర్యన్ ను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పింది. అతని లుక్స్ చాలా బాగుంటాయని కూడా వివరణ ఇచ్చింది.

పెళ్లికి ప్రభాస్ బెస్ట్..
ఒకవేళ డేట్ కు వెళ్లాల్సి వస్తే కండలవీరుడు టైగర్ ష్రాఫ్ ను సెలెక్ట్ చేసుకుంటానని కూడా తెలిపింది. ఇక ఫైనల్ గా పెళ్లి చేసుకోవాల్సి వస్తే అందుకు ప్రభాస్ చాలా బెటర్ అని కృతి సనన్ తెలియజేసింది. కృతి సనన్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అమ్మడు ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











