Kriti Sanon: నా స్వయంవరంలో విజయ్ దేవరకొండ.. ఆ ఇద్దరు హీరోలు కూడా ఉండాలి.. ఎందుకంటే?

గ్లామరస్ బ్యూటీ కృతి సనోన్ ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలు చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే అందుకుంటుంది. ఇక ఈ బ్యూటీ త్వరలోనే మరిన్ని బిగ్ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ప్రతి సారి కృతి ప్రేక్షకుల దృష్టి తన వైపుకు తిప్పుకునే విధంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ స్వయంవరం పెడితే అందులో ఒక ముగ్గురు హీరోలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి అని చెబుతోంది. ఇక ఆ హీరోలలో విజయ్ దేవరకొండ చాలా ముఖ్యం అంటూ.. ఎందుకు అలాంటి వాళ్ళు ఉండాలి అనే ప్రశ్నకు కూడా ఆమె సమాధానం ఇచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమాతో..

తెలుగు సినిమాతో..

మహేష్ బాబు సుకుమార్ కలయికలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అందులో నటించిన కృతి సనోన్ మాత్రం నటిగా అయితే మంచి క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి తెలుగులో మంచి అవకాశాలు రాలేదు. కానీ వెంటనే హిందీలోకి షిఫ్ట్ కావడంతో అక్కడ అగ్ర హీరోలతో అవకాశాలు అందుకుంది.

 గ్లామరస్ పాత్రలు చేయకుండా

గ్లామరస్ పాత్రలు చేయకుండా

కృతి సనోన్ మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న మంచి కథలను సెలెక్ట్ చేసుకోవడం ఆమె కెరీర్ కు చాలా బాగా ఉపయోగపడింది. అనవసరంగా గ్లామరస్ పాత్రలు చేయకుండా పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడింది. ఇక తన పాత్ర నిడివి కొంత సమయంలోనే ఉన్నప్పటికీ కూడా క్యారెక్టర్ మాత్రం కథలో చాలా బలంగా ఉండాలి అని ఫిక్స్ అయింది.

 ప్రభాస్ తో సినిమా

ప్రభాస్ తో సినిమా

ఇక రాబోయే రోజుల్లో కృతి సనోన్ నుంచి కొన్ని పెద్ద సినిమాలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా అందులో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ కూడా ఉంది. అందులో ఆమె సీతమ్మ తల్లి పాత్రలో కనిపించబోతోంది. తప్పకుండా ఈ సినిమా ద్వారా ఆమె మరో రేంజ్ కు వెళుతుంది అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

 స్వయవరంలో ముగ్గురు హీరోలు

స్వయవరంలో ముగ్గురు హీరోలు

ఇక అప్పుడప్పుడు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలతో కూడా జనాలను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ తన స్వయంవరం విషయం గురించి ఒక వివరణ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకవేళ స్వయంవరం పెడితే గనుక అందులో మాత్రం ముగ్గురు హీరోలు తప్పకుండా ఉండాలి అని తెలియజేసింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో పాటు మరొక ఇద్దరు హీరోలు రావాల్సిందే అని తన మనసులోని మాటలు తెలియజేసింది.

విజయ్ దేవరకొండ.. ఎందుకంటే?

విజయ్ దేవరకొండ.. ఎందుకంటే?

నాకు స్వయంవరం గనక జరిగితే విజయ్ దేవరకొండ ఉండాలి ఎందుకంటే అతని లుక్స్ చాలా బాగుంటాయి. అలాగే స్టైల్ మాట్లాడే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. అతన్ని చాలా ఇంటర్వ్యూలలో నేను గమనించాను. చాలావరకు విజయ్ అందులో రియల్ గా తనకు నచ్చినట్లుగా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాడు. అలాగే అతనిలో ఒక మంచి సున్నితత్వం కూడా ఉంది.. అని కృతి సనోన్ విజయ్ గురించి ప్రత్యేకంగా తెలియజేసింది. ఇక స్వయంవరం నిర్వహిస్తే అలాంటి వ్యక్తి ఉండాలి అని బ్యూటీ తెలియజేసింది..

మరో ఇద్దరు హీరోలు

మరో ఇద్దరు హీరోలు

ఇక మరొక ఇద్దరు హీరోల పేర్లు కూడా ఈ బ్యూటీ తెలియజేసింది. యువ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా తన స్వయంవరంలో ఉండాలి అని.. ఆ తర్వాత ఆదిత్య రాయ్ కపూర్ కూడా పాల్గొనాలి అనే కోరికను కూడా కృతి బయటపెట్టేసింది. వీరిద్దరూ కూడా చూడడానికి చాలా బాగుంటారు అని స్టైల్ లోనే కాకుండా వారి ఆటిట్యూడ్ కూడా తనకు బాగా నచ్చుతుంది అని కృతి సనోన్ ఓపెన్ గా తనకు నచ్చినట్లుగా వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X