బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి సిద్దమైన కృతి సనన్.. మ్యారేజ్ డేట్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ గురించి శుభవార్త వినిపిస్తోంది. నార్త్ కు చెందిన కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అనే సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'వన్ : నేనొక్కడినే' వంటి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య సరసన 'దోచేయ్' మూవీతో అలరించింది.
మళ్లీ కాస్తా గ్యాప్ తో రెబల్ స్టార్ ప్రభాస్ తో 'ఆదిపురుష్' చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వకపోయినా.. కృతి సనన్ సీత పాత్రలో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఆమె కెరీర్ లోనూ మళ్లీ ఇలాంటి పాత్రలో నటించే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసే పని లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కృతి సనన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇప్పుడు ఏకంగా కృతి సనన్ పెళ్లికి సిద్ధమైందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు తెగ పబ్లిష్ అవుతున్నాయి. ఢిల్లీకి చెందిన కరణ్ బాహియా బిజినెస్ మెన్ కావడం విశేషం. ఆయనకు పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఇక వీరిద్దరూ స్నేహితులనే తెలుస్తోంది. కబీర్ బాహియా కృతి సనన్ కు మంచి స్నేహితుడని తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రైవేట్ ఈవెంట్లకు ఇద్దరూ కలిసి వెళ్తూ మీడియా కంట పడుతున్నారు. తరుచూ కలిసి ఫొటోలకు ఫోజులిస్తుండటంతో వీరి రిలేషన్ షిప్ కన్ఫమ్ అని తెలుస్తోంది.

ఇక తాజాగా కృతిసనన్, తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బాహియా తో కలిసి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. దీంతో మళ్లీ కృతి సనన్ పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. త్వరలో నే కృతి సనన్ పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగానే ఢిల్లీలో ఉంటున్న తన బాయ్ ఫ్రెండ్ కబీర్ బాహియా తల్లిదండ్రులను కృతి సనన్ మర్యాద పూర్వకంగా కలిసిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2025లో తప్పకుండా ఈ జంట ఒక్కటవుతుందని అంటున్నారు. వీలై అన్నీ కుదిరితే అతి త్వరలోనే కృతిసన్ పెళ్లి తేదీ రానుందని తెలుస్తోంది. ఇక కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తూ బిజీగా ఉంది. కెరీర్ ను సాఫీగానే కొనసాగిస్తోంది. చివరిగా 'దో పత్తి' చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం 'థేరే ఇష్క్ మే' షూటింగ్ లో జాయిన్ అయ్యింది.


Click it and Unblock the Notifications











