వరుస ఫ్లాపులతో కృతి శెట్టి.. బేబమ్మకు మరో బంపర్ ఆఫర్!
టాలీవుడ్ సినిమా దగ్గర ఇప్పుడు సమీకరణాలు చాలా త్వరగా మారిపోతున్నాయ్. థియేటర్స్ కి జనం రావడం నుంచి పలు చిత్రాలు ఫలితాలు అన్నీ కూడా ట్రెండ్ కి తగ్గట్టుగా మారుతున్నాయి. వీటితో పాటుగా హీరోయిన్స్ మేటర్ కూడా ఎప్పుడూ ఒక నిలకడగా కనిపించడం లేదు. అలా ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ హవా నడుస్తుంది కానీ వారిలో ఎంత త్వరగా ఫేమ్ లోకి వచ్చారో అంతే త్వరగా భారీ ప్లాప్ లు కూడా వాళ్ళని వెంటాడుతున్నాయి.
కాగా ఆ యంగ్ హీరోయిన్స్ లో బేబమ్మ అంటూ టాలీవుడ్ కి పరిచయం అయ్యిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి కూడా ఒకామె. మరి కృతి మొదటి సినిమా "ఉప్పెన" తోనే అందరి దృష్టి ఆకర్షించి ఓవర్ నైట్ స్టార్ అయ్యి కూర్చుంది. ఆ వెంటనే శ్యామ్ సింగ రాయ్ తో మరో హిట్ కొట్టడంతో టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువెత్తాయి. కానీ ఈ మధ్య రెండేళ్లలో వచ్చిన ఒక్క సినిమా కూడా తన నుంచి హిట్ పడలేదు.

కానీ అప్పటికే ఓకే చేసిన సినిమాలు చేతిలో ఉన్నాయి. సో సాఫీగా సినిమాలు చేస్తూ వెళ్ళిపోతుంది. బట్ హిట్ రేట్ లేదు. ఇది ఏ హీరోయిన్ కి అయినా కొంచెం టెన్షన్ గానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ కృతి శెట్టి విషయంలో కాస్త వేరేగా ఉందని చెప్పాలి. ఈ మధ్య ఆమె నుంచి వచ్చిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ లు గానే నిలిచిపోయాయి.
అలాగే మొన్ననే వచ్చిన "మనమే" కూడా ఏమంత రాణించలేదు. దీనితో కృతి శెట్టి హిట్ కి ఇంకా పడిగాపులు కాయాల్సి వస్తుంది. అయితే ఇన్ని ప్లాప్ లు వస్తున్నా కూడా బేబమ్మ క్రేజ్ తగ్గలేదనే వినిపిస్తుంది. కాగా ఇప్పుడు ఓ క్రేజీ ఆఫర్ ని ఆమె సొంతం చేసుకున్నట్టుగా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇది తెలుగులో కాదు కానీ తమిళ్ లో అట.

అది కూడా టాలెంటెడ్ దుల్కర్ సల్మాన్ సినిమాలో ఈమె ఛాన్స్ కొట్టేసింది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతే కాకుండా ఈ సినిమాని తమిళ్ లో పలు సాలిడ్ హిట్స్ డెలివర్ చేసిన టాలెంటెడ్ దర్శకుడు మారి సెల్వరాజ్ చేయనున్నారని వినిపిస్తుంది. ఇలా ఓ సాలిడ్ ప్రాజెక్ట్ నే ఆమె పట్టేసింది అని ఇప్పుడు టాక్.
అయితే ఇది ఆమెకి తమిళ్ లో మొదటి సినిమా ఏమీ కాదు ఆల్రెడీ అక్కినేని నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తో "కస్టడీ" అనే బై లింగువల్ సినిమా చేసి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని ఈ అమ్మడు అందుకుంటుందో వేచి చూడాల్సిందే. దీనికి ముందు ఈ ప్రాజెక్ట్ పై ఒక అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











