‘తప్పతాగిన మత్తులో శృంగారం.. అర్ధరాత్రి జరిగిన ఆ తప్పుతో’

దక్షిణాది వినోద పరిశ్రమలో టాలెంటెడ్ యాక్టర్స్‌లో ఒకరు కుబ్రా సెయిత్. అందంతోనే అభినయంతో కూడా మెప్పించిన యువతార. అయితే బోల్డుగా నటించడంలోనే కాకుండా మాట్లాడటంలో ఎలాంటి ఫిల్టర్లు ఉపయోగించదనే పేరుంది. తన మనసుకు నచ్చినట్టు మాట్లాడటం చేస్తుంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది. తన జీవితంలో జరిగిన సంఘటనను, అలాగే చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకొన్నది. కుబ్రా సెయిత్ ఇంటర్వ్యూలోని వివరాలు, ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బెంగళూరులో జన్మించిన ఈ భామ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత టెలివిజన్ హోస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. తన ప్రతిభను గుర్తించిన దర్శక, నిర్మాతలు ఆమెకు సినిమా ఆఫర్లతో స్వాగతం పలికారు. దాంతో ఆమె తొలిసారి సిటీ ఆఫ్ లైఫ్ అనే బాలీవుడ్ సినిమాలో నటించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన రెడీ చిత్రంలో గ్లామర్ పాత్రను పోషించే అవకాశం దక్కింది. ఆ తర్వాత హిందీ సినిమా రంగంలో వరుసగా ఆఫర్లు లభించాయి.

Kubbra Sait about pregnancy

బాలీవుడ్‌లో ఐ లవ్ న్యూయార్క్, సల్మాన్ ఖాన్‌తో సుల్తాన్, రణ్‌వీర్ సింగ్‌తో గల్లీ భాయ్, జవానీ జానేమన్, దేవా, సన్ ఆఫ్ సర్దార్ 2 లాంటి చిత్రాల్లో నటించింది. ఇక వెబ్ సిరీస్‌లతో కూడా ప్రొఫెషనల్‌గా బిజీ అయ్యారు. ఫోర్ ప్లే, ఫర్జీ, ది ట్రయల్, ఇల్లీగల్, షెహర్ లాకోట్, రైస్ అండ్ ఫాల్ అనే సీరిస్‌లో నటించి మెప్పించింది. గ్లామర్ తారగానే కాకుండా పెర్ఫార్మర్‌గా ఆకట్టుకొన్నది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కుబ్రా సెయిత్ సంచలన విషయాలను పంచుకొన్నది. ఓ రోజు నేను ఓ ఫ్రెండ్‌తో బయటకు వెళ్లాను. మేమంత కలిసి డ్రింక్స్ తీసుకొన్నాం. ఆ రాత్రంతా అల్లరి పనులు చేశాం. మద్యం మత్తులో ఫుల్లుగా ఎంజాయ్ చేశాం. మా ఫ్రెండ్స్ అంతా బాగా చిల్ అయ్యాం. ఆ తర్వాత నా ఫ్రెండ్‌తో ఇద్దరం పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నాం. దాని ఫలితం నాకు గర్భం వచ్చింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ రావడంతో చాలా భయపడ్డాను అని ఆమె అన్నారు.

నా ఫ్రెండ్‌తో కలిసి చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందాను. కానీ మానసికంగా ధృడంగా నాకు నేను అయ్యాను. ఆ తర్వాత అబార్షన్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. అయితే ఆ తర్వాత ఆ నిర్ణయంపై అనేక ప్రశ్నలు నన్ను వెంటాడాయి. పెళ్లికి ముందు వ్యక్తిగతంగా తీసుకొనే నిర్ణయాల వల్ల మహిళలను ఎలా జడ్జ్ చేస్తారనే విషయం నాకు ఇప్పటికే ప్రశ్నగానే ఉంటుంది. జీవితం మనం ఊహించుకొన్నంత సులభమేమీ కాదు. సమాజాన్ని ఫేస్ చేయడం చాలా కష్టమని అర్ధమైంది అని కుబ్రా సెయిత్ అన్నారు.

More from Filmibeat

Read more about: kubbra sait bollywood sultan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X