17 ఏళ్లకే శీలం కోల్పోయా.. రెండేళ్లు అలాంటి నరకం.. అసలు విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్
మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఇక సెలబ్రిటీలు సైతం ఈ లైంగిక వేధింపులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఎప్పుడో జరిగిపోయిన విషయాలను కూడా ఇప్పటి నటీమణులు బయట పెట్టడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. తాజాగా ప్రముఖ నటి కుబ్రా సైత్ సంచలన ప్రకటన చేసింది. 17 ఏళ్ల వయసులో తన అంకుల్ తనను ఎంతసేపు శారీరకంగా హింసించాడో బయట పెట్టింది. ఆ వివరాల్లోకి

ఆసరాగా తీసుకుని
'సేక్రెడ్ గేమ్స్'తో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి కుబ్రా సైత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వెల్లడించింది. ఆమె అంకుల్ రెండేళ్ల పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించింది. ఈ బాధాకరమైన సంఘటనను నటి తన 'ఓపెన్ బుక్' పుస్తకంలో పంచుకుంది. తనకు 17 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, తన కుటుంబానికి సన్నిహితంగా ఉండే తన అంకుల్ కుటుంబ కష్టాలను ఆసరాగా తీసుకుని తనను వేధించాడని ఆమె చెప్పింది.

అసభ్యంగా తాకుతూ
తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌కు తరచూ వెళ్తూ ఉండే వాళ్లట. అలా ఆ రెస్టారెంట్ యజమాని మా కుటుంబానికి దగ్గరయ్యాడని, మా అమ్మకు ఆర్థికంగా సహాయం కూడా చేశాడని ఆమె వెల్లడించింది. ఆ తర్వాతే అతడిలోని అసలు రూపాన్ని బయటపెట్టాడని, కారులో కూర్చొన్నప్పుడు నా తొడ మీద చేయి వేసి నిమిరుతూ, అసభ్యంగా తాకుతూ వేధించడం మొదలుపెట్టాడని ఆమె వెల్లడించింది.

సైలెంట్‌గా
తాను అంకుల్ అని పిలిస్తే కూడా అలా పిలవొద్దని వారించే వాడని అప్పుడు తరచూ మా ఇంటికి రావడం కూడా మొదలుపెట్టాడని కుబ్ర వెల్లడించింది. తన తల్లి అతనికి వంట చేసి పెట్టేది, నవ్వుతూ మాట్లాడేదని, దీంతో అతను కూడా ఆమె ముందే అతడు నా బుగ్గ మీద ముద్దు పెడుతూ నువ్వు నాకెంతో ఇష్టం అని కబుర్లు చెప్పేవాడని, దీంతో నాకు అసౌకర్యంగా అనిపించినా ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉండిపోయేదాన్నని కుబ్ర వెల్లడించింది.

పెదాలపై ముద్దు
అంతేకాక ఓసారి నన్ను హోటల్‌కు తీసుకెళ్లి నా పెదాలపై ముద్దు పెట్టాడని, ఆ పనికి షాకయ్యానని ఆమె వెల్లడించింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదని ఆమె వెల్లడించింది. ఒకసారి నా కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో మా అమ్మ చాలా బాధపడి ఏడ్చిందని, ఆ వ్యక్తి మా అమ్మ చేయి పట్టుకుని చాలా నిశ్చింతగా నువ్వేం వర్రీ కాదు అని మా ఇంట్లో ఉన్న కొన్ని కష్టాలు తీరేలా డబ్బులు ఇచ్చాడని అన్నారు.

నాశనం చేస్తానని
ఆ వ్యక్తి ఎలాంటి స్వార్థం లేకుండా మాకు సహాయం చేస్తున్నాడని అనిపిస్తుంది, కానీ మనిషి తాను నటించినంత మంచివాడు కాదని తర్వాత తెలిసింది. ఇక ఒకరోజు హోటల్ కు తీసుకువెళ్లి నాకు ముద్దులు పెడుతూనే తనకు నచ్చింది చేసుకుంటూ పోయాడని, అప్పుడే నా వర్జినిటీ కోల్పోయానని ఆమె పేర్కొంది. ఇదే నా జీవితంలో అత్యంత సిగ్గుచేటయిన రహస్యం అని రెండున్నరేళ్ల పాటు అతడు లైంగికంగా వేధించాడని కుబ్ర వెల్లడించారు. ఈ విషయం మా ఇంట్లో చెప్తే మా కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడని, అందుకే బాధను, అనుభవించిన క్షోభను ఎవరికీ చెప్పుకోలేకపోయానని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











