లండన్ వీధుల్లో రష్మిక చక్కర్లు.. ఎవ్వరూ గుర్తించరని పబ్లిక్‌గా అలాంటి పనులు
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది నేషనల్ క్రష్ రష్మిక మందన్నయే. ఆమెకు ప్రజంట్ శుక్ర మహర్దశ పీక్స్‌లో ఉంది. ఏ సినిమాలో నటించిన ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అన్న ముద్రపడిపోయింది. పుష్ప, యానిమల్, పుష్ప 2, చావా.. లేటెస్ట్‌గా కుబేరతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. రష్మిక డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. కాల్షీట్లు అడ్జెట్ చేయలేక రష్మిక సైతం ఇబ్బంది పడుతున్నారంటే అతిశయోక్తి కాదు.
కిర్రాక్ పార్టీతో ఎంట్రీ
కన్నడలో కిర్రాక్ పార్టీ అనే ఓ చిన్నసినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టి.. రక్షిత్ శెట్టితో ప్రేమ, నిశ్చితార్ధం, వివాహం రద్దుతో శాండిల్‌వుడ్‌ను వదిలేసి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది రష్మిక మందన్న. ఛలో, భీష్మ, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ బ్రాండ్ ఏర్పరచుకున్నారు. ఈ దశలో బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడా వరుస బ్లాక్‌బస్టర్లతో నేషనల్ క్రష్‌గా మారారు రష్మిక. హిందీ నాట స్టార్ హీరోయిన్లకు కూడా లేని క్రేజ్‌ను ఆమె సంపాదించుకున్నారు.

దేవుడి ఆశీస్సులతోనే విజయాలు
తన కష్టానికి తోడు దర్శక నిర్మాతలు, సహనటులు సహకారం, ప్రేక్షకుల అభిమానం, అన్నింటికీ మించి భగవంతుని ఆశీస్సులతోనే తనను ఇన్ని విజయాలు వరించాయని అంటున్నారు రష్మిక. ఇతరులను, వారి సమయాన్ని గౌరవిస్తానని.. ఒక యాక్టర్‌గా నిత్యం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటానని ఆమె వెల్లడించారు. తనకు వీలైనంత వరకు అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటానని పేర్కొంది. ఎంత స్టార్ హీరోయిన్ అయినా కొన్ని విషయాలను ఆమె తూచా తప్పకుండా పాటిస్తారట.
అలాంటి సీన్స్ చేయను
సినిమాలలో స్మోకింగ్ సీన్స్‌కు దూరంగా ఉంటానని.. నిజ జీవితంలోనూ ధూమపానాన్ని అస్సలు ఎంకరేజ్ చేయనని రష్మిక తెలిపారు. స్మోకింగ్ సీన్స్‌లో నటించాల్సి వస్తే.. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినాసరే వదులుకుంటానని నేషనల్ క్రష్ తేల్చిచెప్పారు. అంతేకాదు.. గతంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యామిమల్ సినిమాలో బోల్డ్ సీన్స్‌లో నటించడంపైనా రష్మిక క్లారిటీ ఇచ్చారు. మనిషిలో మరో కోణం ఉంటుందని.. దానినే యానిమల్‌లో చూపించారని ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయని కుబేర నటి తెలిపారు. సినిమా బాగుందో, బాలేదో నిర్ణయించే అధికారం పూర్తిగా ప్రేక్షకులదేనని ఆమె అన్నారు.
లండన్‌లో చిల్ అవుతోన్న రష్మిక
కుబేర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్, థామా, కాక్‌టెయిల్ 2లో నటిస్తున్నారు. సినిమాలు, షూటింగ్స్ లేని సమయంలో విహారయాత్రలకు వెళ్లడం రష్మికకు అలవాటు. దీనిలో భాగంగా ప్రజంట్ లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. తనను అక్కడ ఎవ్వరూ గుర్తుపట్టకపోవడంతో షాపింగ్స్‌లో బిజీగా గడుపుతోంది. లండన్ వీధుల్లో స్వేచ్ఛగా నడుచుకుంటూ వెళ్తూ , రెస్టారెంట్‌లలో తనకు ఇష్టమైన ఐస్‌క్రీమ్స్, ఇతర వంటకాలను రుచి చూస్తున్నారు. తన లండన్ ట్రిప్, ఇతర విషయాలకు సంబంధించిన ఫోటోలను రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











