Don't Miss!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Rakul Preet Singh పరువాల విందు.. బీచ్ లో ఒకలా.. డ్రెస్సు కిందకు జరిపి మరోలా!
ఇంటర్ అయిపోయాక పాకెట్ మనీ కోసం సినీ ఇండస్టీలోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్. గిల్లి అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది ఈ ఫిట్ నెస్ సుందరి. 7జీ బృందావన్ కాలనీ సినిమా రీమెక్ గా వచ్చిన ఈ చిత్రం తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. కెరటం అనే చిన్న సినిమాతో మొదలు పెట్టి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. తన అంద చందాలతో యువతను తనవైపు తిప్పుకున్న ఈ క్యూట్ భామ టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పేరు గడించింది. ప్రస్తుతం హిందీలో అనేక వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిన ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కవ్విస్తోంది.

డిజాస్టర్ హీరోయిన్ గా..
ఒక సమయంలో తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా యూత్‌ను అట్రాక్ట్ చేసింది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ఫిట్ నెస్ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా రకుల్ ప్రీత్ సింగ్ మారిన.. ఆ సినిమాలు మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో 2022లో బిగ్గెస్ట్ డిజాస్టర్ హీరోయిన్ గా నిలిచింది.

గోల్స్ కోసం కష్టపడే..
తెలుగులో కెరటం అనే చిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాలో సంగీతగా గోల్స్ కోసం కష్టపడే కాలేజీ గర్ల్ గా అలరించింది రకుల్. దీంతో ఆమెకు సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రంలో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలా అలరిచింది.

ఒక్కసారిగా పాపులర్..
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా తర్వాత ఆది సాయి కుమార్ రఫ్, గోపిచంద్ లౌక్యం సినిమాల్లో నటించిన రకుల్ అనంతరం కరెంట్ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించి అగ్ర హీరోలతో జతకట్టింది. టాలీవుడ్ అగ్ర హీరోలతో జతకట్టడంతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ఫిట్ నెస్ బ్యూటి రకుల్. అయితే చాలాకాలంపాటు తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో, ఫిట్ నెస్ తో ఎంటర్టైన్ చేసిన కూల్ భామ బాలీవుడ్ కి మకాం మార్చింది.

యారియాన్ సినిమాతో ఎంట్రీ..
యారియాన్ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ కు అంత పెద్ద సక్సెస్ రాలేదు. తర్వాత అనేక హిందీ చిత్రాలతోపాటు సౌత్ సినిమాల్లో కూడా అలరించింది ఈ ఫిట్ నెస్ సుందరి. బాలీవుడ్ లో కొంతకాలం సినిమాలు చేశాక మరోసారి కొండపొలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ కు జోడి కట్టింది ఈ భామ.

అన్ని సినిమాలు డిజాస్టర్లుగా..
అయితే రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నంతగా కొండపొలం సినిమా విజయం సాధించలేదు. కొండపొలం హిట్ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ వైపు నడిచింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం హిందీలో చేతినిండా ఫుల్ సినిమాలతో యమ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే ఆమె నటించిన రన్ వే 34, అటాక్ పార్ట్ 1, థ్యాంక్ గాండ్, డాక్టర్ జీ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి.

నేరుగా ఓటీటీలోకి..
అన్నింటికంటే అక్షయ్ కుమార్ తో చేసిన కట్ పుట్లి సినిమా నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ విడుదైల పర్వాలేదనిపించుకుంది. ఇక ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఆశలన్నీ ఛత్రీవాలీ సినిమాపైనే ఉన్నాయి. ఇందులో ఎప్పుడు చేయనటువంటి పాత్ర కండోమ్ టెస్టర్ గా రకుల్ ప్రీత్ అలరించనుంది. ఈ సినిమాను నేరుగా ప్రముఖ ఓటీటీ జీ5లో విడుదల చేయనున్నట్లు ఇటీవల తెలిపారు మేకర్స్. ఈ సినిమాను జనవరి 20న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎద అందాలతో హాట్ షో..
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నిత్యం హాట్ షోతో యూత్ ను అట్రాక్ట్ చేస్తుంటుంది కూల్ బ్యూటి రకుల్. పూల డిజైన్ తో ఉన్న డ్రెస్ కిందకు జారుతున్నట్లుగా ఉండి రకుల్ ప్రీత్ సింగ్ ఎద అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే బీచ్ లొ పొట్టి డ్రెస్సు ధరించిన రకుల్ ప్రీత్ సింగ్ క్లీవేజ్ తోపాటు థైస్ షో చేసింది. ఈ పిక్స్ నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.