‘ ఈ హీరో నాకన్నా చిన్నోడు .. ఆ విషయంలో ఆకలితో రగిలిపోతూ ’
చిత్ర పరిశ్రమలో నటీనటుల ఎఫైర్స్, చీకటి వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటీనటుల మధ్య బంధాలపై మీడియాలో ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీలో హీరోయిన్లు, ఇతర మహిళా నటుల వేధింపుల వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. మీ టూ ఉద్యమంతో పాటు ఇటీవల జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ చిత్ర పరిశ్రమలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపుల గురించి వివరించాయి. ఈ క్రమంలోనే నటీనటుల సంబంధాలు, హీరోయిన్‌తో సెట్‌లో అసభ్య ప్రవర్తన వంటి అంశాలపై బాలీవుడ్ సీనియర్ నటి కునిక సదానంద్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రకు చెందిన కునిక నటిగా, సింగర్‌గా, లాయర్‌గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా బాగా పాపులర్ . 80వ దశకంలో విలన్, లేడీ కమెడియన్ రోల్స్‌లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితం, వివాదాలతోనే కునిక బాగా పాపులర్ అయ్యారు. ఆమెకు రెండు సార్లు వివాహం జరగ్గా .. వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. తొలుత ఢిల్లీకి చెందిన అభయ్ అనే వ్యక్తితో కునిక వివాహం జరగ్గా ఈ దంపతులకు అరిహంత్ జన్మించారు. వీరి బంధం ఎక్కువ రోజులు సాగలేదు.

అభయ్‌తో విడిపోయిన తర్వాత లాల్ అనే వ్యక్తితో 35 ఏళ్ల వయసులో కునిక పెళ్లి జరిగింది. లాల్ ద్వారా అయాన్ అనే బిడ్డ జన్మించాడు. ఇక ఆమె ఎఫైర్స్ గురించి బాలీవుడ్‌లో ఇప్పటికీ చెప్పుకుంటారు. దిగ్గజ నటుడు ప్రాణ్ కుమారుడు సునీల్ సికంద్‌తో డేటింగ్ చేశారు. ఆ తర్వాత సింగర్ కుమార్ సానుతో బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి చూపులోనే ఆయనతో ప్రేమలో పడిపోయిన కనిక.. బలమైన అనుబంధం ఏర్పరచుకున్నారు. దాదాపు 125 సినిమాల్లో నటించిన కునికలో సింగర్ కూడా దాగున్నారు. ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా ఎన్నో హిట్ సాంగ్స్‌ను అందించారు.
ముంబైలో వైట్ ఇటాలియన్ కేఫ్, జింగ్‌కేఫ్ మెజిస్టికా, ది రాయల్ బాంక్వెట్ హాల్, ఎక్స్‌హేల్ స్పా వంటి వ్యాపారాలు నిర్వహిస్తూ వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 స్టేజ్ షోలు ఇచ్చారు. కర్మ ఈవెంట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీని స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. భారతదేశంలో గడిచిన 20 ఏళ్లుగా ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. 2005లో తారా ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించిన కునిక పేద ప్రజలకు విద్య, వైద్యం అందిస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కునిక ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులను పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కునిక సదానంద్ లాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో తెరవెనుక జరిగిన బాగోతాలు, తాను ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు ఉన్న ఎఫైర్స్ గురించి తెలిపారు.
అక్షయ్ తనకంటే చిన్నవాడేనని.. కానీ ఇంకా ఫిట్‌గానే ఉన్నాడని , నిజానికి మగవాళ్లలో మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ లెవల్స్ ఎక్కువైతే ఫిట్‌నెస్ వస్తుందని కునిక అన్నారు. ఇక షూటింగ్ స్పాట్‌లో లైట్‌మెన్లు కూడా హీరోయిన్‌లని పొందాలని చూసేవారని.. వారిని ఎలాగైనా లొంగదీసుకోవాలని చేతులకి పర్‌ఫ్యూమ్ పూసుకొచ్చేవారని ఆమె వ్యాఖ్యానించారు. షూటింగ్‌కి పేకప్ చెప్పిన తర్వాత ఆకలిగా ఉన్న సింహాలు వేటకు సిద్ధంగా ఉన్నట్లుగా సెట్‌లో మగాళ్లు ప్రవర్తించేవారని కునిక సంచలన వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











