twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగాడిగా మారిన ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!!

    |

    కొందరికి వింత వింత కోరికలుంటాయ్. యవ్వనంలో ఉన్నప్పుడే తాము వృద్దాప్యంలో ఎలా ఉంటారో చూడాలని కోరికగా ఉంటుంది. మరి కొందరికీ తమ జెండర్ మారితే ఎలా ఉంటారో చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అబ్బాయిలుగా ఉన్నవారు అమ్మాయిలుగా మారితే, అమ్మాయిలుగా ఉన్నవారు అబ్బాయిలుగా మారితే ఎలా ఉంటుందో చూసుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన నాటి హీరోయిన్ ఓ చిలిపి పని చేసింది. మగాడిలా మారితే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించింది.

    వింత యాప్‌లు..

    వింత యాప్‌లు..

    సోషల్ మీడియాలో రకరకాలు యాప్‌లు పుట్టుకొస్తూనే ఉంటున్నాయి. ఆ మధ్య హీరో, హీరోయిన్లందరూ వృద్దాప్య ఫోటోలపై పడ్డారు. తమకు వృద్దాప్యం వస్తే ఎలా ఉంటామో చూసుకుని సంబరపడ్డారు. తెలుగు హీరోల్లో చాలా మంది ఆ యాప్‌ను వాడి వృద్దాప్య ఫోటోలను తీసుకున్నారు. ప్రస్తుతం జెండర్ ఛేంజ్‌ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు.

    గత కొన్ని రోజులుగా..

    గత కొన్ని రోజులుగా..

    గత కొన్ని రోజులుగా హీరోలు హీరోయిన్లు మారితే ఎలా ఉంటారో అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అలాగే హీరోయిన్లు అబ్బాయిలుగా మారితే ఎలా ఉంటారోనన్న ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి.

    తాజాగా కుష్బూ..

    తాజాగా కుష్బూ..

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాటి తరం హీరోయిన్లలో అందరికంటే కుష్బూనే ముందుంటుంది. రాజకీయ నాయకురాలిగా పలు సమస్యలపై స్పందిస్తూ.. అందరికీ అందుబాటులో ఉంటుంది. తాజాగా తన జెండర్‌ను మార్చుకుంటే ఎలా ఉంటుందో అందరికీ చూపించింది.

    Recommended Video

    Kushboo Made Comments on Rajinikanth's Political Entry
    బాగానే ఉన్నా..

    బాగానే ఉన్నా..

    నాటి తరం హీరోయిన్‌ అయినా కుష్బూ ఎంతటి ఫిట్‌నెస్‌ను మెయింటెన్ చేస్తుందో అందరికీ తెలిసిందే. అలాంటి కుష్బూను సడెన్‌గా మగాడి రూపంలో చూసేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే కుష్బూ మాత్రం తనను తాను మెచ్చుకుంది. మగాడిగా మారితే కూడా బాగానే ఉన్నానని కితాబిచ్చుకుంది.

    English summary
    Kushboo sundar Shares Her Male Version Pic Goes Viral. she shares her Male Version Pic on social media. it creates storms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X