Kushboo Sundar : 20 ఏళ్ల అమ్మాయిలా మారిన ఖుష్బూ .. ఆ ఇంజెక్షన్ వల్లేనా?

చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ప్రేక్షకుల ఆరాధ్య దైవమైనా సరే కొన్నాళ్లకు సైడ్ కావాల్సిందే. ఈ విషయం ఎందరి విషయంలోనో నిజమైంది. గతంలో 20 నుంచి 30 ఏళ్ల పాటు హీరోయిన్లు తమ హవా సాగించేవారు. కానీ ఇప్పుడు అందులో పావు వంతు కూడా కెరీర్‌ను కొనసాగించలేకపోతున్నారు. శరీరంలో మార్పులు, కొత్త హీరోయిన్ల రాకతో వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఎన్నో ఇబ్బందులను, పోటీని తట్టుకుని కొందరు మాత్రమే తమ కెరీర్‌ను నిలబెట్టుకుంటున్నారు.

భారతదేశంలో హీరోహీరోయిన్లను దేవుళ్ల మాదిరిగా పూజిస్తారన్న సంగతి తెలిసిందే. ఏకంగా గుడులు కూడా కట్టిన చరిత్ర మన సొంతం . అలా హీరోల రాజ్యంలో తొలిసారిగా తన స్టార్ డమ్‌తో ఇండస్ట్రీని ఊపేశారు ఖుష్బూ. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ తమిళ తంబీలకు ఆరాధ్య దైవంగా నిలిచారు. విక్టరీ వెంకటేష్ సరసన కలియుగ పాండవులు చిత్రం ద్వారా తెలుగువారిని పలకరించిన ఖుష్బూకు కోలీవుడ్‌లో స్టార్ డమ్ దక్కింది. షార్ట్ గ్యాప్‌లోనే సౌత్‌లోని అందరు అగ్రహీరోలతో నటించిన ఘనత దక్కించుకున్నారు ఖుష్బూ.

Kushboo Sundar strong counter to netizens who trolled her look

కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సుందర్ సీతో ప్రేమలో పడిన ఖుష్బా ఆయను పెళ్లాడారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. కొన్నాళ్లు డేటింగ్ తర్వాత 2000వ సంవత్సరంలో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు సంతానం . పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఖుష్భూ.. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తన ఇమేజ్, వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ ఇప్పటికీ దుమ్మురేపుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీగా ఉంటున్నారు.

ఇక తొలి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉండే ఖుష్బూ సుందర్ .. డీఎంకే, కాంగ్రెస్, బీజేపీలలో పనిచేశారు. తమిళనాడు ఎన్నికల్లోనూ పోటీ చేసినా నిరాశే ఎదురైంది. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి తన అదృష్టం పరీక్షించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఖుష్బూ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ సీనియర్ హీరోయిన్.. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు , ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఫోటోలు పోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

54 ఏళ్ల వయసున్న ఈ ఖుష్బూ ఆ ఫోటోలలో 20 ఏళ్ల అమ్మాయిలా చాలా సన్నగా, నాజూకుగా కనిపించడంతో అంతా షాకయ్యారు. ఆ ఫోటోలకు బ్యాక్ టూ ద ఫ్యూచర్ అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆమె సడెన్‌ ఇలా ఎలా మారారంటూ నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌కు దిగారు. సన్నగా మారడానికి ఆమె ఇంజెక్షన్స్ చేయించుకున్నారని.. వాటి వల్లే ఇలా మారిపోయారని కామెంట్స్ పెట్టారు. దీనిపై ఖుష్బూ ఘాటుగా స్పందించారు. మీరు మనుషులా? మీ ముఖాలను సోషల్ మీడియాలో చూపించరు? ఎందుకంటే అసహ్యంగా ఉంటారు కాబట్టి.. మీ పేరెంట్స్‌ను చూస్తుంటే సానుభూతి కలుగుతోందని ఇచ్చిపడేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు , ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: kushboo sundar movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X