స్విమ్మింగ్ పూల్‌లో సమంత సెన్సేషనల్ షో: చాలా రోజుల తర్వాత ఘాటుగా!
చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అదిరిపోయే నటనతో తెలుగు సినీ ప్రియులను సుదీర్ఘ కాలంగా ఫిదా చేస్తూ దూసుకుపోతోన్న నటి సమంత రూత్ ప్రభు. ఏ ముహూర్తన టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిందో కానీ.. చాలా తక్కువ సమయంలోనే ఈ అమ్మడు స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇలా ఇప్పుడు కూడా చేతి నిండా చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరు కూడా చూసేయండి!
పంథాను మార్చేసిన సామ్: 'ఏమాయ చేశావే' అంటూ వచ్చి మాయ చేసిన సమంత.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండానే దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆరంభంలో గ్లామర్ రోల్స్‌లోనే నటించిన సామ్.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకే రెడీ అవుతోంది. ఇలా ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.

ఒక హిట్.. ఒక డిజాస్టర్‌తో: ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ మూవీలనే చేస్తున్న సమంత రూత్ ప్రభు.. గత ఏడాది 'యశోద' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది. ఇటీవలే సామ్.. గుణశేఖర్ తెరకెక్కించిన 'శాకుంతలం' మూవీతో వచ్చింది. కానీ, ఇది భారీ నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
ఖుషీతో వచ్చి... ఆ సిరీస్: సమంత రూత్ ప్రభు.. విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' అనే మూవీని చేసింది. ఈ సినిమా ఈరోజే అంటే సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ అయింది. దీనికి ఆరంభంలోనే మంచి టాక్‌తో పాటు రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఇదిలా ఉండగా.. సమంత ఇప్పుడు 'సీటాడెల్' అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇది కూడా మరికొద్ది రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఆ వ్యాధితో.. గ్యాప్ ఇచ్చి: పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి విధితమే. బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్‌పై ప్రభావాన్ని చూపించే దీనివల్ల ఆమె ఆరోగ్యం క్షిణిస్తోంది. దీంతో కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకుంది. ఇక, ఇప్పుడీమె ఏకంగా ఏడాది పాటు యాక్టింగ్‌కు గ్యాప్ ఇవ్వబోతున్నట్లు ఇటీవలే న్యూస్ వచ్చింది.
అందులో ఫుల్ యాక్టివ్‌గా: హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తోన్నా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఫలితంగా అభిమానులను ఖుషీ చేస్తూ తన రేంజ్‌ను ఇంకా పెంచుకుంటూనే ఉంది.
అందాల ఆరబోత ఫుల్: దాదాపు దశాబ్దానికి పైగానే సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రచ్చ చేస్తూనే ఉంది. ముఖ్యంగా తన అందచందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలను, వీడియోలను తరచూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేస్తోంది. తద్వారా తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. అదే సమయంలో సామ్ నేషనల్ రేంజ్‌లోనూ పాపులారిటీని సొంతం చేసుకుంటోంది.

సమంత పిక్స్ వైరల్‌గా: ఈ మధ్యన డోస్ పెంచేసి మరీ అందాలను ఆరబోస్తున్న సమంత రూత్ ప్రభు.. తాజాగా తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించి మరీ హాట్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఈ పిక్స్‌లో సామ్ అందాలు బాగా కనిపిస్తూ కవ్విస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











