Don't Miss!
- News
అమలాపురం అల్లర్లు: మరో 25 మంది అరెస్ట్
- Sports
IPL 2022: ఆర్సీబీ ఓటమి.. విరాట్ కోహ్లీ భావోద్వేగం!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సమంత విడాకులపై మొదటిసారి స్పందించిన క్లోజ్ డైరెక్టర్.. అప్పుడు పక్కనే ఉన్నాను అంటూ..
టాలీవుడ్ లో బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్ గా గుర్తింపు అందుకున్న సమంత నాగచైతన్య విడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి కలిగించిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే వారు ఇద్దరు అంత హఠాత్తుగా ఎందుకు విడిపోయారు అనే విషయంలో ఎన్నో రకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. అయితే అసలు కారణం ఏమిటి అనే విషయంలో ఇంత వరకు ఎవరు కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. అయితే సమంత ఒడిదుడుకుల్లో కూడా చాలా క్లోజ్ గా ఉన్న మంచి ఫ్రెండ్.. ఇటీవల మొదటిసారి ఆ విషయంపావు స్పందించడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే...

నాలుగేళ్ళ లోపే..
గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సమంత నాగచైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిన విషయం తెలిసిందే. ఏ మాయ చేశావే సినిమాతో ఒకటైన ఈ జెండా ఆ తర్వాత కొన్నేళ్ల వరకు ప్రేమ లో ఉండి అనంతరం పెళ్లి బంధం తో మరింత దగ్గరయ్యారు. ఇక నాలుగేళ్లలోపే వారి వివాహ బంధానికి ముగింపు కార్డు పెట్టడంతో హాట్ టాపిక్ గా మారింది.

అందరూ అదే తరహాలో..
సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని దాదాపు ఏడు నెలల గడుస్తున్నా కూడా ఇంకా ఆ విషయంలో ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక సమంత నాగ చైతన్య దగ్గరగా ఉండే వారు కూడా విడాకుల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అందరూ ఒకే విధంగా అది వారి వ్యక్తిగత విషయం అని చాలా సున్నితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు.

సమంత క్లోజ్ ఫ్రెండ్
ఇక సమంతకు ఇండస్ట్రీలో అత్యంత క్లోజ్ గా ఉండే వారిలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు. 'అలా మొదలైంది' సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి సమంతకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. జబర్దస్త్ సినిమాతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఓ బేబి అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని కూడా అందుకున్నారు.

ఆరోగ్యం బాగోలేని సమయంలో..
అయితే సమంత ఆరోగ్యం బాగోలేని సమయంలో అలాగే ఆమెకు సంబంధించిన ఒడిదుడుకుల్లో కూడా నందిని రెడ్డి క్లోజ్ గా ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. మొదటి పరిచయంలోనే ఇద్దరి మధ్యలో ఒక మంచి స్నేహం ఏర్పడింది అని ఆ తర్వాత ఒక సిస్టర్స్ తరహాలో కలిసి పోయాము అని నందినీరెడ్డి తెలియజేశారు.


తెలియాల్సిన అవసరం లేదు...
అయితే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు నేను ఆ విషయం గురించి పెద్దగా తెలుసుకోవాలని అనుకోలేదు అంటూ.. ఎందుకంటే ప్రతి ఒక్క భార్య భర్తల మధ్య గొడవలు ఉంటాయి. అది వాళ్ల పర్సనల్ విషయం. బయట వారికి తెలియాల్సిన అవసరం లేదు. అలాగే నాకు కూడా ఆ విషయం పెద్దగా ఆసక్తి లేదు. అందుకే నేను ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా ఆ విషయం గురించి అడగలేదు మేము ఎంత క్లోజ్ అయినా కూడా కొన్ని పరిమితుల్లోనే ఆ బంధం ఉంటుంది.. అని నందిని రెడ్డి చాలా క్లియర్ గా తన వివరణ ఇచ్చింది.