Nayanthara Remuneration బాలీవుడ్‌లో నయనతార రికార్డు... ఐశ్వర్యరాయ్ లాంటి హీరోయిన్లను దాటేసి!

లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అయినా... ఆమె టాప్ హీరోయిన్స్ లో ఒకరు. ఇక ఈ భామ ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటించింది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. అయితే ఈ సినిమా హిట్టుతో నయన్ రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

నయనతార హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. ఇక వరుసగా తమిళ, తెలుగు సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారింది. అంతే కాదు.. తెలుగు, తమిళ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఈ బ్యూటీ నటించింది. ఇక అప్పట్లో శింబుతో ప్రేమలో పడినట్లు.. వార్తలు వచ్చాయి. కానీ శింబుతో బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రభుదేవ ప్రేమలో పడినట్లు కూడా వార్తలు వినిపించాయి.

Nayanthara Remuneration

దేవకు ఇంతకు ముందే పెళ్లి కావడంతో.. అతనితోనూ నయన్ కు బ్రేకప్ అయినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ భామ ఆ తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడి పెళ్లి కూాడ చేసుకుంది. ఇటీవల ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇక ఇటీవల పిల్లలతో నయన తారా ఇన్ స్టాలోకి ఎంట్రీ కూడా ఇచ్చేసింది.

లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా.. తగ్గకుండా నయన్ నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని.. లేడీ సూపర్ స్టార్ అయింది. ఇక పెళ్లి తర్వాత నయన్.. బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

జవాన్ సినిమాకోసం నయనతార దాదాపు 11 కోట్లు తీసుకుందని తెలుస్తోంది. ఇక ఈమె తదుపరి సినిమాలకు సైతం ఈ అమ్మడి అదే రేంజులో తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ రేంజులో రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి దక్షిణాది నటిగా నయనతార రికార్డు క్రియేట్ చేసింది. సౌత్ హీరోయిన్స్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయన్... ఒకప్పటి ఐశ్వర్య రాయ్ రెమ్యూనరేషన్ కూడా దాటేసింది.

సౌత్ నుంచి వెళ్లిన ఐశ్వర్య రాయ్.. రెమ్యూనరేషన్ భారీగానే ఉండేది. అలాంటి ఆమె రెమ్యూనరేషన్ సైతం నయనతార బ్రేక్ చేసి... రూ.11కోట్లకు పైగా తన సినిమాలకు తీసుకుంటుందని టాక్. ఇక జవాన్ సినిమా ఆమెకు బాలీవుడ్ లో మంచి డెబ్యూ చిత్రమని చెప్పవచ్చు. ఈ సినిమా బాలీవుడ్ చిత్రమైనప్పటికీ... అందులో నటించిన నటీనటులు చాలా వరకు సౌత్ వాళ్లే ఉండటం విశేషం. ఈ చిత్రంతో లేడీ సూపర్ స్టార్ నయన్ హిట్టును తన ఖాతాలో వేసుకుని రెమ్యూనరేషన్ పెంచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X