రూటు మార్చిన నయనతార.. లేడీ సూపర్‌స్టార్‌లో ఈ మార్పుల వెనుక కారణం అదేనా?

రంగుల రాట్నం లాంటి సినీ ప్రపంచంలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ. మంచి హిట్లు పడి, విజయాలు పలకరిస్తే ఐదారేళ్లు గ్యారెంటీ. లేదూ అంటే మరో రెండేళ్లు ఎక్స్‌టెన్షన్ వరకు ఓకే. వీటన్నింటికి మించి హీరోలతో సమానంగా క్రేజ్‌ను ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ కాలంలో హీరోయిన్ల కెరీర్ స్పాన్, క్రేజ్ ఎవరెస్ట్ రేంజ్‌లో వుండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితులు లేవు. అలాంటిది ఈ జనరేషన్‌లో లాంగ్ కెరీర్, హీరోలతో సమానంగా (ఒకదశలో వారికంటే ఎక్కువే) స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు లేడీ సూపర్‌స్టార్ నయనతార.

ఈ కేరళ కుట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు దాటింది. కానీ నేటికి అదే క్రేజ్. నయన్‌తో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఎంతోమంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ కావడమో, పెళ్లి చేసుకుని సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టడమో జరిగింది. కానీ నయనతార విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది. శింబు, ప్రభుదేవాలతో ప్రేమ విఫలమైనా, వ్యక్తిగత జీవితంలో సమస్యలు, వరుస ఫెయిల్యూర్స్ పలకరించినా వాటన్నింటిని తట్టుకుని నిలబడి నిజమైన లేడీ సూపర్‌స్టార్‌గా నిలిచింది. 40కి చేరువవుతోన్నా ఆమె డేట్స్ కోసం , కండీషన్స్‌కి ఒప్పుకుని కూడా నిర్మాతలు క్యూ కడుతున్నారంటే నయన్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

lady superstar nayanthara In A Sculpted High Slit Gown at GQ Power List 2024 Awards

ఇదిలావుండగా.. ఇన్నేళ్ల కెరీర్‌లో నయనతార హాట్ ఫోటో షూట్లు చేయడం వాటిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం వంటి వాటికి ఆమె దూరం. ఆన్‌లైన్‌లో ఎంత యాక్టీవ్‌గా వున్నప్పటికీ.. కేవలం కుటుంబ విషయాలు, సినిమాల సంగతులు తప్పించి హాట్ ఫోటో షూట్ల వంక చూడలేదు నయనతార. అలాంటిది సోషల్ మీడియాలో నయనతార బ్లాక్ డ్రెస్‌తో దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు హాట్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు. నయనతార పరిస్ధితి బాగానే వుంది కదా , చేతి నిండా సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది . మరి డీప్ నెక్ దుస్తుల్లో ఈ హాట్ షూట్‌లు ఎందుకు అంటే.

ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో నయనతార పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ డిజైన్ ప్లోరల్ డీప్ నెక్‌ దుస్తుల్లో , వైట్ స్కిన్ టోన్‌తో స్టైలీష్‌గా తళుక్కుమన్నారు నయన్. ఇలాంటి ట్రెండీ వేర్‌ ధరించినప్పటికీ.. ఇతరత్రా యాక్సరీస్ వేసుకోలేదు. కేవలం ముక్కు పుడక, చెవు దిద్దులు మాత్రమే ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది లేడీ సూపర్‌స్టార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X