గుర్తుపట్టలేనంతగా మారిపోతున్న ఫేస్ .. షాకింగ్ న్యూస్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్

గ్లామర్ ఫీల్డ్ అయిన సినీ పరిశ్రమలో అందానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. హీరోల సంగతి ఏమో గానీ హీరోయిన్లు మాత్రం అందంగా ఉంటేనే అవకాశాలను అందుకోగలరు. వారి అందమే వారికి శ్రీరామరక్ష. అందుకే డైట్‌లు, షేక్‌లు, యోగా, వర్కవుట్స్‌తో ఫిగర్ మెయింటైన్ చేస్తుంటారు హీరోయిన్లు. గతంలో కన్ను, ముక్కు వంకరగా ఉంటే అలాగే నెట్టుకుని రావాల్సి వచ్చేది కానీ శస్త్ర సాంకేతిక రంగం అభివృద్ది చెందడంతో సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి పలువురు హీరోయిన్లు సర్జరీలను ఆశ్రయించారు. తాజాగా ఈ శస్త్రచికిత్సలపై కీలక వ్యాఖ్యలు చేశారు లేడీ సూపర్‌స్టార్ నయనతార. ఈ వివరాల్లోకి వెళితే..

మేల్ డామినేటింగ్ ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీలో .. హీరోలకే పోటీనిస్తూ దూసుకెళ్తున్నారు నయనతార. ఒకప్పుడు కెరీర్‌లో ఎదురుదెబ్బలు, పర్సనల్ లైఫ్‌లో వరుసగా లవ్ ట్రాజెడీలు ఎదురైనా తట్టుకుని నిలబడి లేడీ సూపర్‌స్టార్ రేంజ్‌కి చేరుకున్నారు నయన్. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌లలో ఒకరిగా ఆమె వెలుగొందుతున్నారు. బడా స్టార్స్ అయినా సరే ఆమె కాల్షీట్ల కోసం వెయిట్ చేస్తున్నారంటే నయన్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

lady superstar Nayanthara reaction on plastic surgery rumours here s the details

హీరోయిన్ల కెరీర్ అంటే మహా అయితే ఓ ఐదారేళ్లు, సినిమాలు హిట్టయితే మరో రెండేళ్లే. అలాంటిది ఏకంగా రెండు దశాబ్ధాలుగా కెరీర్‌ను కంటిన్యూ చేస్తున్నారు నయనతార. అది కూడా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానో, మరొకటో కాదు.. హీరోయిన్‌గానే. తొలినాళ్లలో ఎంత బిజీగా ఉన్నారో ఇప్పుడు అంతకుమించి చేతి నిండా ఆఫర్లతో దూసుకెళ్తున్నారు నయనతార. ప్రస్తుతం ఆమె డైరీ రెండు, మూడేళ్ల వరకు ఖాళీగా లేదంటే అతిశయోక్తి కాదు. ఈమె చేతుల్లో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి. హిందీలో సికిందర్, తని ఒరువన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, టాక్సీక్, ముక్తి అమ్మన్ 2, మహారాణి తదితర చిత్రాలున్నాయి.

శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం బెడిసికొట్టడంతో కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిన నయనతార తిరిగి కోలుకున్నారు. ఈ క్రమంలో ఆమె జీవితంలోకి యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంట్రీ ఇచ్చాడు. 2015లో నేను రౌడీనే సినిమా షూటింగ్ సమయంలో నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమగా మారింది. 2021లో వీరిద్దరూ తమ బంధాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 2022 జూన్ 9న చెన్నైలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లయిన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం భర్త , పిల్లలతో నయనతార వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు.

lady superstar Nayanthara reaction on plastic surgery rumours here s the details

ఇదిలాఉండగా.. 40 ప్లస్‌లోనూ ఎంతో అందంగా కనిపిస్తూ కుర్రహీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు నయన్. కొన్నిసార్లు నాజుగ్గా కనిపించే ఆమె, మరికొన్నిసార్లు బబ్లీగా కనిపించారు. దీంతో నయన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా పలుమార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. తన ఐ బ్రోస్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని కానీ తాను సర్జరీ చేయించుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

కను బొమ్మల షేప్ మారినప్పుడల్లా ఫేస్‌లో తేడా కనిపిస్తుందని.. ఈ విషయంలోనే ప్రజలు కన్‌ఫ్యూజై ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు డైటింగ్ వల్ల ఈ మార్పులు రావొచ్చు.. అంతే తప్పించి తన శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదని, కావాలంటే గిల్లి చూడండి అంటూ లేడీ సూపర్‌స్టార్ సరదాగా అన్నారు. ప్రస్తుతం నయనతార వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X