షూటింగ్‌కి బ్రేక్.. భర్త, పిల్లలతో వెకేషన్.. రిలాక్సింగ్ మోడ్‌లో లేడీ సూపర్‌స్టార్
మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీలో .. స్టార్స్‌కే పోటీనిస్తూ దూసుకెళ్తున్నారు లేడీ సూపర్‌స్టార్ నయనతార. ఒకప్పుడు కెరీర్‌లో ఎదురుదెబ్బలు, పర్సనల్ లైఫ్‌లో వరుసగా లవ్ ట్రాజెడీలు ఎదురైనా తట్టుకుని నిలబడి ఈ స్థాయికి చేరుకున్నారు నయన్. సౌతిండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. బడా స్టార్స్ అయినా సరే ఆమె కాల్షీట్ల కోసం వెయిట్ చేస్తున్నారంటే నయన్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
హీరోయిన్ల కెరీర్ అంటే మహా అయితే ఓ ఐదారేళ్లు, సినిమాలు హిట్టయితే మరో రెండేళ్లే. అలాంటిది ఏకంగా రెండు దశాబ్ధాలుగా కెరీర్‌ను కంటిన్యూ చేస్తున్నారు నయనతార. అది కూడా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానో, మరొకటో కాదు.. హీరోయిన్‌గానే. స్టార్టింగ్‌లో ఎంత బిజీగా ఉన్నారో ఇప్పుడు అంతకుమించి వరుసగా ఆఫర్లు అందుకుంటున్నారు. ఆమె డైరీ రెండు, మూడేళ్ల వరకు ఖాళీగా లేదంటే అతిశయోక్తి కాదు. నయనతార ఉంటే తమ సినిమాకు ప్లస్ పాయింట్ అనేవాళ్లు ఎందరో. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్ చేతుల్లో 8 సినిమాలు ఉన్నాయి. హిందీలో సికిందర్, తని ఒరువన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, టాక్సీక్, ముక్తి అమ్మన్ 2, మహారాణి తదితర చిత్రాలున్నాయి.

శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం బెడిసికొట్టడంతో కొన్నాళ్లు మానసిక వేదనను అనుభవించిన నయనతార తిరిగి కోలుకున్నారు. సినిమాలు , షూటింగ్స్‌తో తన పని తాను చేసుకుంటూ పోయిన ఆమె జీవితంలోకి యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంట్రీ ఇచ్చాడు. 2015లో నేను రౌడీనే సినిమా షూటింగ్ సమయంలో నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమాయణం సాగించింది.
2021లో వీరిద్దరూ తమ బంధాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 2022 జూన్ 9న చెన్నైలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల నుంచి అతిరథ మహారథులు ఈ వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లయిన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదాస్పదమైంది. సరోగసి విధానంలో వీరిద్దరూ అమ్మానాన్నలుగా మారారు. సరోగసి ద్వారా పిల్లలను కనేందుకు వీరిద్దరూ నిబంధనలను అతిక్రమించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై స్వయంగా తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఆ వివాదం నెమ్మదిగా సద్దుమణగగా.. నయనతార తన వైవాహిక జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. తీరిక వేళల్లో భర్త, పిల్లలతో గడుతున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను వారిద్దరూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతుంటారు. తాజాగా పిల్లలు, భర్తతో వెకేషన్‌కు వెళ్లిన ఫోటోలను నయనతార తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో విఘ్నేష్ శివన్‌తో నడుస్తూ నయన్ చిరునవ్వులు చిందిస్తున్నారు.. క్యూట్ లుక్స్‌లో పిల్లలిద్దరూ చాలా ముద్దుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలను నయనతార అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











