హీరోల్లో నా క్రష్ అతనే.. ఇది వింటే జ్యోతిక నన్ను చంపేస్తుంది

90లలో తెలుగు, తమిళ ప్రేక్షకులను తన అందం, నటనతో మంత్రముగ్ధులను చేసిన స్టార్ హీరోయిన్ లైలా (Laila). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన లైలా.. ఇప్పుడు మళ్లీ రీ-ఎంట్రీతో ప్రేక్షకుల ముందుకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. గోవాలో జన్మించిన లైలా.. బాలీవుడ్ చిత్రం 'దుష్మన్ దునియా కా'తో సినీ ప్రయాణం ప్రారంభించారు. అనంతరం మలయాళంలో 'ఇద ఒరు స్నేహగాథ' సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో విజయకాంత్ సరసన నటించిన 'కల్లళగర్' సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. అక్కడి నుంచి వరుసగా తమిళ, తెలుగు భాషల్లో అవకాశాలు రావడంతో లైలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

తెలుగులో కూడా లైలా మంచి క్రేజ్ సంపాదించారు. ముఖ్యంగా ఫ్యామిలీ, రొమాంటిక్, యూత్‌ఫుల్ పాత్రల్లో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తన అందం, ఎక్స్‌ప్రెషన్స్, నేచురల్ యాక్టింగ్‌తో 90ల ప్రేక్షకుల కలల రాకుమారిగా మారిపోయింది. అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె సినిమాలకు దూరమవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. 2006లో చివరిసారిగా ఓ మలయాళ సినిమాలో నటించిన లైలా.. అనంతరం విదేశీ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుని పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆమె అభిమానులు తెరపై మళ్లీ ఎప్పుడు కనిపిస్తారా అని ఎంతోకాలం ఎదురుచూశారు.

Laila Opens Up About Surya Bond and Her Telugu Re-Entry After 22 Years

దాదాపు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సర్దార్ సినిమాతో లైలా మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించగా, లైలా కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ సౌత్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇక ఇప్పుడు దాదాపు 22 ఏళ్ల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గోదారి గట్టుపైన అనే చిత్రంలో లైలా కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు సుభాష్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, జగపతిబాబు, రాజీవ్ కనకాల వంటి నటులు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లైలా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన సహనటుడు సూర్య గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. "మీ కో-స్టార్లలో ఎవరంటే క్రష్?" అని అడగగా.. లైలా వెంటనే "సూర్య" అని సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే వెంటనే నవ్వుతూ "జ్యోతిక నన్ను చంపేస్తుంది" అంటూ సరదాగా కామెంట్ చేశారు. అనంతరం అసలు విషయం చెబుతూ.. "అది క్రష్ కాదు. మేమిద్దరం చాలా మంచి స్నేహితులు. మా మధ్య చాలా ప్రత్యేకమైన బంధం ఉంది. మేము చాలా బాగా కలిసిపోతాం. అందుకే సూర్యతో ఉన్న బాండింగ్ నాకు చాలా స్పెషల్" అని క్లారిటీ ఇచ్చారు.

సూర్య-లైలా కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అప్పట్లో మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా వారి కెమిస్ట్రీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అందుకే ఇప్పటికీ వారి జోడీ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు లైలా మళ్లీ సూర్య గురించి ఇలా మాట్లాడటంతో పాత జ్ఞాపకాలు అభిమానుల్లో మళ్లీ రీఫ్రెష్ అయ్యాయి. అదే ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా లైలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నాకు తెలుగులో నటించాలని చాలా ఇష్టం. కానీ నాకు సరైన కథలు రావడం లేదు. చాలా మంది దర్శకులు తల్లి పాత్రలు, సోదరి పాత్రలు ఆఫర్ చేస్తున్నారు. అలాంటి పాత్రలు చేయడానికి నాకు ఆసక్తి లేదు" అంటూ ఆమె ఓపెన్‌గా చెప్పారు.

ప్రస్తుతం తనకు నటనకు ప్రాధాన్యం ఉన్న, మంచి బలమైన పాత్రలు కావాలని వెల్లడించారు. దర్శకుల పేర్లు మాత్రం చెప్పడానికి ఆమె నిరాకరించారు. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన లైలా.. ఇనాళ్లు అయినా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో లైలా ఫోటోలు, పాత పాటలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆమె రీ-ఎంట్రీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మంచి పాత్రలు వస్తే టాలీవుడ్‌లో మళ్లీ వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని లైలా చెప్పడంతో, ఆమెను మళ్లీ వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more about: sumanth prabhas suriya laila
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X