నా భర్తకు ఎందుకు దూరంగా ఉంటానంటే? మంచు లక్ష్మీ దిమ్మతిరిగే జవాబు
డైలాగ్ కింగ్, మంచు మోహన్ బాబు కూతురిగా లక్ష్మి మంచు తెలుగు ఆడియెన్స్ కు పరిచయమే. స్టార్ కిడ్ గా ఆడియెన్స్ కు పరిచయం అయినా ఆమెకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని మంచు లక్ష్మి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకోసం తనవంతుగా కృషి చేస్తూనే వస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ ను ప్రారంభించిన లక్ష్మి ఇప్పటి వరకు అన్నీ కలిసి 20 ఫీచర్ ఫిల్మ్స్ లో నటించింది. అమెరికన్ టెలివిజన్ సిరీస్ ల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటోంది.
కెరీర్ విషయంలో లక్ష్మి మంచు కొన్నాళ్లుగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫ్యామిలీ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. మంచు ఫ్యామిలీ గొడవలు ఇటీవల తరుచుగా బయటికి వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆమె వంతుగా ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్యలో మంచు మనోజ్ పెళ్లి పెద్దగానూ వ్యవహరించి జనాల నుంచి ప్రశంసలు పొందారామె. ఇక ప్రస్తుతం ఆ ఇంట ముదురుతున్న ఘర్షణలను ఎప్పటికప్పుడు నివారించే ప్రయత్నం చేస్తూనే వస్తోంది.

ఇదిలా ఉంటే.. మంచు లక్ష్మి తన అభిమానులకు ఎప్పుడూ సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. అయితే లక్ష్మి మంచుకు 2006నో వివాహామైనా తన భర్తకు దూరంగా బతుకుతుందని, తండ్రి వద్దనే ఉంటుందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. దీనిపై ఇంతవరకు లక్ష్మి ఎక్కడా ఓపెన్ కాలేదు. దీంతో ఆ సందేహాన్ని నివృత్తి చేసేవారు లేరు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భర్తతో దూరంగా ఉండటంపై.. స్పందించారు లక్ష్మి.
లక్ష్మి తన భర్త గురించి మాట్లాడుతూ... వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారని చెప్పింది. కానీ సమాజంలో ఉన్న ధోరణిలా కాకుండా ఎవరికి వారు ప్రశాంతంగా బతికేలా, స్వేచ్ఛను ఇచ్చిపుచ్చుకుంటామని తెలిపింది. న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ లో జీవిస్తామని చెప్పింది. స్వేచ్ఛ, ప్రైవసీ, పర్సనల్ రెస్పాన్సిబిటీ లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. తన భర్త కోవిడ్ తర్వాత చాలా నేర్చుకున్నామని, మాకు ఎలా అనిపిస్తే అలా బతుకుతున్నామని చెప్పుకొచ్చింది. జనాలు ఫీల్ అవుతారనే కారణాలతో మా ప్రశాంతతను కోల్పోమన్నారు.
వాళ్లద్దరూ కలిసే ఉంటారని, రీసెంట్ గానే రెండు నెలలు భర్తతోనే కలిసి ఉందని చెప్పింది. తన పాపను కూడా ఆయన తీసుకెళ్లారని చెప్పింది. మళ్లీ వారంలో వచ్చి తనతో కలిసి ఉంటారని వివరించింది. ఇక మంచు లక్ష్మి భర్త ఆండీ శ్రీనివాసన్. ఈయన చైన్నై వాసి. ఫారేన్ లో ఐటీ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నారు. వీరికి 2006లో హిందూ సంప్రాదాయం ప్రకారం వివాహామైంది. కూతురు విద్యా నిర్వాణ మంచు ఆనంద్ కూడా ఉంది. తరుచుగా చిన్నారితో కలిసి ఫొటోలు పంచుకుంటూనే ఉంటుంది. కెరీర్ లో మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో ముంబైలోనే ఉంటోంది. ప్రస్తుతం 'ఆదిపర్వం' చిత్రంలో నటిస్తోంది. 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలోని తన నటనకు లక్ష్మి మంచు ప్రశంసలు అందుకుంది. ఫిల్మ్ ఫేయిర్, నంది, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కూడా అందుకుంది.


Click it and Unblock the Notifications











