తాప్పీపై లక్ష్మీ మంచు ప్రశంసల వర్షం.. ఆ సినిమా చూసి..

బాలీవుడ్ నటి తాప్సీ పొన్ను నటించిన తప్పడ్ సినిమాపై అప్పట్లో విమర్శకులు ప్రశంసలు గుప్పించారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తాప్సీ నటనను అభినందించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో కూడా అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా టాలీవుడ్ నటి, నిర్మాత హోస్ట్ లక్ష్మీ మంచు తప్పడ్ సినిమాపై స్పందించారు. తాజాగా తప్పడ్ చూసిన లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో తాప్సీపై ప్రశంసలు కురిపించారు.

తప్పుడ్ సినిమా ఇటీవల చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత నేను ఆమెకు ఫ్యాన్ అయ్యాను అంటూ లక్ష్మీ మంచు సుధీర్ఘమైన లేఖను రాశారు. తప్పడ్ సినిమా చూసిన తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఈ సినిమా గురించి నా అభిప్రాయం రాయాలనే కోరిక పెరిగిపోయింది. భారతీయ స్త్రీగా, కొన్ని కట్టుబాట్లు ఉన్న సొసైటి నుంచి వచ్చిన నాకు కొన్ని ప్రశ్నలను ఈ సినిమా లేవనెత్తింది అని లక్ష్మీ మంచు తన లేఖలో పేర్కొన్నారు.

Lakshmi Manchu praises Taapsee Pannu after watching Thappad

తప్పడ్ సినిమా చూసినంత సేపు నా మనసును తోలిచివేస్తున్నట్టు అనిపించింది. ఆ సినిమా చూసిన తర్వాత నాకు నేను మారిపోవాలని అనుకొన్నాను. ఇలాంటి సినిమాలో నటించిన తాప్సీని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. తెర మీద కథను చెప్పడం నీకంటే గొప్పగా ఉండరేమో అని దర్శకుడు అనుభవ్ సిన్హాను కూడా లక్ష్మీ అభినందించింది.

తాప్సీ పన్ను హీరోయిన్‌గా పరిచయమైన తెలుగులో చిత్రం ఝమ్మంది నాదం చిత్రానికి మంచు లక్ష్మీ నిర్మాత అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత తాప్సీ, ఆమె స్నేహితులుగా మారిపోయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X