మంచు లక్ష్మీ బ్యూటీఫుల్ సెల్ఫీ వైరల్.. సోషల్ మీడియాలో తొలిసారి అలా!
మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే వారసులుగా అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు టాలీవుడ్‌లో తక్కువనే చెప్పాలి. అలా వచ్చిన వాళ్లను వేళ్లపై లెక్కించేంత మందే ఇప్పుడు పరిశ్రమలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలోనూ కొందరు మాత్రమే సక్సెస్ కాగా.. మరికొందరు సరైన బ్రేక్ కోసం వేచి చూస్తున్నారు. అందులో మంచు లక్ష్మీ ఒకరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా ఇలా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాలు పెద్దగా చేయకున్నా సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

సినీ నేపథ్యంతో లక్ష్మీ పరిచయం
సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆయన తన పిల్లలను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు. మంచు మనోజ్, మంచు విష్ణు ఎప్పుడో సినిమా హీరోలుగా ప్రయాణాన్ని మొదలు పెట్టగా.. వాళ్లతో పాటే మంచు లక్ష్మీ కూడా ఎంట్రీ ఇచ్చేసింది.

ముందు అక్కడే ఎంట్రీ ఇచ్చింది
తెలుగు వాళ్లకు నటిగా పరిచయం అవడానికి ముందే మంచు లక్ష్మీ 'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లో నటించింది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే మూవీలోనూ చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే 'లక్ష్మీ టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఒకేసారి మూడు విధాలుగా పరిచయం అయింది.

తక్కువ సినిమాలతోనే ఫేమస్‌గా
తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో మంచు లక్ష్మి నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులను అందుకుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. గుర్తింపును బాగానే తెచ్చుకుంది.

అక్కడా ఇక్కడా మెరుస్తోన్న లక్ష్మీ
మొదట్లో నిర్మాతగా మారిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత సినీ నటిగానూ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలను చేసింది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. ఇలా వీలైనన్ని ఎక్కువ వాటిలో నటిస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. ఇలా అన్ని చోట్లా కనిపిస్తూ సందడి చేస్తోంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ
సినిమాలు, షోలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ విశేషాలను కూడా షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా నిత్యం వార్తల్లోనే ఉంటూ తన ఫాలోవర్లను కూడా పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ అలాంటివి కూడా
మిగిలిన వాళ్లతో పోలిస్తే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మీ.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తూ రచ్చ చేస్తోంది. అలాగే, బుల్లి బట్టలతో దిగిన ఫొటోలను, వీడియోలను సైతం ఇంటర్నెట్‌లో షేర్ చేసుకుంటోంది. వీటిలో చాలా వరకూ అందాలు మొత్తం ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అయిపోతోంది.

అద్దం ముందర హాట్ ఫోజుతో రచ్చ
తాజాగా మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ తీసేసి మరీ కనిపించింది. ఫలితంగా ఆమె స్పోర్ట్స్ బ్రాతో దర్శనమిచ్చింది. అంతేకాదు, ఈ పిక్‌లో మంచు లక్ష్మి నాభి అందాలు కూడా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది తెగ వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











