మగ వాళ్లు చేస్తే సంసారం.. ఆడవాళ్లు చేస్తే.. లక్ష్మీ మంచు ఘాటు స్పందన
తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ మంచు మోహన్ బాబు నటవారసత్వాన్ని స్వీకరించి నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచు లక్ష్మీ తన మార్కును ప్రదర్శిస్తున్నారు. గతంలో నిర్మాతగా మంచి అభిరుచి ఉన్న సినిమాల్లో నిర్మించడమే కాకుండా విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఏది ఏమైనా నిజం మాట్లాడటంలో ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల యాంకర్ మహీ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన విషయాలు, చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ వివరాల్లోకి వెళితే..
బోల్డ్ డిసిషన్స్ మగ వాళ్లు తీసుకొంటే ప్రశంసలు వస్తాయి. మహిళలు తీసుకొంటే వారిని జడ్జ్ చేస్తారనే విషయం గురించి మంచు లక్ష్మీ కుండబద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పింది. మనం పితృస్వామ్య సమాజంలో బతుకుతున్నాం. పురుషాధిక్య ప్రపంచంలో జీవిస్తున్నాం. మేమే చేస్తే సంసారం.. మీరు చేస్తే ఆ వ్యవహారం అనే విధంగా ఉంటుంది. నేను సామెతను నా నోటితో పూర్తిగా చెప్పను. మీకు దాని గురించి తెలుసే ఉంటుందని అనుకొంటున్నాను అని మంచు లక్ష్మీ అన్నారు.

మగాడు ఏదైనా చేస్తే సర్దుకుపోతారు. అదే ఆడపిల్ల చేస్తే మాత్రం అంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. నా పెళ్లి సమయంలో నా భర్తకు ఒకటే మాట చెప్పాను. నీవు ఏ పని చేసినా.. ఆ పనిని నేను కూడా చేయగలను అనే మాటలను గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను. దాంతో ఆయన ఏదైనా పని చేయడానికి జంకుతాడు. నేను చేస్తే తను కూడా చేస్తుందనే విషయం, ఒక రకమైన భయం మనసులో ఉంటుంది. ఆ భయం ఎవరికీ లేదు. ఆడవాళ్లు ఇలానే ఉండాలి. ఇలా ఉండాలని ఎవరు రాశారు అని మంచు లక్ష్మీ ప్రశ్నించారు.
గతంలో మంచు లక్ష్మీ నిజాయితీగా చెప్పిన సమాధానం, తన అభిప్రాయం రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నది. మంచు అమ్మాయి నిర్భయంగా తన అభిప్రాయాలను వెల్లడించడంలో ముందు వెనుకా, ఆలోచించదు. ముక్కుసూటిగా మాట్లాడటమే ఆమె నైజం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మంచు లక్ష్మీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆదిపర్వం అనే చిత్రంలో నటించింది. ఇంకా దక్ష ది డెడ్లీ కాన్సిపిరసీ, తమిళంలో పోకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి చివరి వారంలో ఆమె నటించిన లేచింది మహిళా లోకం అనే సినిమా రిలీజైంది. ఇంకా పలు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications










