For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'పటాకా'గా మారి ఎల్లోడ్రెస్‌లో సెగలు రేపుతున్న రత్తాలు.. !

  |

  చాలా ఏళ్ల క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయిన లక్ష్మీ రాయ్ కి కాలం కలిసి రాలేదు. కెరీర్ ఆరంభంలో సంప్రదాయమైన పాత్రలతో డీసెంట్‌గా కనిపించిన ఈ అమ్మడు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ భామ గ్లామర్ డోస్ పెంచింది. ఇక్కడ వర్కౌట్ కాకపోవడంతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి స్కిన్ షో చేస్తూ మంచి హాట్ బాంబ్ లాగా మారిపోయింది. అందులో భాగంగానే తాజాగా బట్టలు ఎల్లో డ్రెస్ లో ఈ భామ ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి!

  అలా ఎంట్రీ

  అలా ఎంట్రీ

  లక్ష్మీ రాయ్ గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె కాలం కలిసి రాక పేరు మార్చుకుని రాయ్ లక్ష్మిగా మారింది. ఒక రకంగా ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు ఏమో ? స్టార్ హీరోయిన్ కాకపోయినా మాంచి ఘాటు హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. శ్రీకాంత్ నటించిన ‘కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాయ్ లక్ష్మి మొదటి సినిమాలో చాలా పద్దతైన పాత్రలో నటించింది. అయినా ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తరువాత మరో సినిమా చేసి బాలీవుడ్ మీద మనసు పడింది.

  రత్తాలుగా ఫేమస్

  రత్తాలుగా ఫేమస్

  అక్కడ కూడా ఆమెకు కాలం కలిసి రాలేదు. ఇక దీంతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెం 150 సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ కుర్ర కారు చేత మాస్ స్టెప్స్ వేయించేలా ఐటెం భామగా మారిపోయింది. అయినా సరే రాయ్ లక్ష్మికి హీరోయిన్ గా మాత్రం ఆశించిన అవకాశాలు రాలేదు. ఇక సెక్సీ లుక్స్‌తో వెండితెరకు అందం తీసుకురావడంలో రాయ్ లక్ష్మికి మంచి టాలెంట్ ఉంది.

  కష్టపడుతున్నా ఫలితం లేదు

  కష్టపడుతున్నా ఫలితం లేదు

  ఎంత కష్టపడుతున్నా అడపాడదపా ఐటెమ్‌ సాంగ్‌లు, లేదా చిన్న చిన్న గ్లామర్‌ పాత్రలు తప్ప పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు. అయినా సరే ఎలాగో కెరీర్‌ని లాక్కుంటూ వస్తున్నా ఈ భామ ఇక లాభం లేదని మ్యారేజ్‌ చేసుకుని కొత్త లైఫ్‌ మొదలు పెట్టాలని నిర్ణయించుకుందట. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ఈ భామ మొన్నీమధ్య ప్రకటించి అభిమానులకు షాక్‌ ఇచ్చింది.

  ఎంగేజ్‌మెంట్‌ కూడా

  ఎంగేజ్‌మెంట్‌ కూడా

  తాజాగా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్న ఈ భామ పెళ్లి డేట్ కూడా కూడా ఫిక్స్ చేసుకున్నట్టు చెప్పేసింది రాయ్‌ లక్ష్మీ. ఈ మధ్య కాలంలో తనని చాలా మంది మ్యారేజ్‌ గురించి, పెళ్లి పిక్సయ్యిందట అని అడగడంతో అన్ని ప్రశ్నలకు పుల్‌స్టాప్‌ పెట్టేయాలని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసిందీ హాట్‌ బ్యూటీ. నా రిలేషన్‌షిప్‌ని దాచాలనుకోవడం లేదన్న ఈ భామ నా రిలేషన్‌షిప్‌ గురించి ఇతరులకు అసవరం లేదని చెప్పి షాకిచ్చింది. అప్పుడే నేను చేసుకోబోయే వాడి వివరాలు మాత్రం చెప్పలేను` అని చెప్పుకొచ్చింది.

  పటాకా

  అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న ఈ బ్యూటీ.. తాజాగా తన లేటెస్ట్ ఫోటో అభిమానులతో పంచుకుంది.పసుపు కలర్ స్కర్ట్ వేసుకుని ఈ భామ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అదే రంగు సన్ గ్లాసెస్ ఈ భామకు మరింత అందాన్ని చేకూర్చాయి. ఇక ఆమె వేసుకున్న స్కర్ట్ మీద ‘పటాకా!' అనే ట్యాగ్ కూడా ఉంది. "మీరు దేని మీద ద్రుష్టి పెడతారో, అదే అవుతారు అని'' ఆమె క్యాప్షన్ పెట్టింది.

  English summary
  Raai Laxmi is in the industry for a long time now, apart from heroine roles this beauty performed item numbers in the films like Balupu, Khaidi No: 150, and Sardaar Gabbar Singh. Raai Laxmi shared a beautiful bright picture today, Wearing an orange-yellow skirt, Raai looks dazzlingly beautiful in the picture. Heroine also had a tag called, ‘Pataka!’ on her outfit. “U become what u give ur attention to,” she captioned the picture.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X