బాత్రూంలో ఎన్నో సార్లు ఆ పని చేశా.. ఆ ఫీలింగ్స్ వస్తే తట్టుకోలేను: దివి ఊహించని వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌తో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల చిన్నది దివి వాధ్యా ఒకరు. అందం, అభినయంతో సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ అమ్మడు.. ఇటీవలే 'లంబసింగి' అనే సినిమాతో వచ్చింది. ఇందుకోసం దావత్ అనే షోలో పాల్గొంది. ఇందులో సినిమా విషయాలతో పాటు తన కష్టాల గురించి దివి వాధ్యా మొదటిసారి మాట్లాడింది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
అప్పుడే వచ్చి.. వాటిలోనే:టీనేజ్‌లో ఉన్నప్పుడే మోడల్‌గా పాపులర్ అయిన దివి వాధ్యా 'లెట్స్ గో' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72'తో పాటు చాలా చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' మూవీలోనూ తళుక్కుమని మెరిసింది. ఇలా ఆరంభంలోనే ఎన్నో చిత్రాలను చేసినా దివికి సరైన గుర్తింపు దక్కలేదు.

బిగ్ బాస్‌తో ఫుల్ ఫేమస్:సినిమాల్లో ఓనమాలు నేర్చుకుంటోన్నప్పుడే దివి వాధ్యాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ భామ అందంతో పాటు ఆటతో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. అలాగే నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అయినా దివికి ఈ షో బాగానే కలిసొచ్చిందని చెప్పాలి.
ఫుల్ బిజీగా.. లంబసింగి:బిగ్ బాస్ షో తర్వాత దివి వాధ్యాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఆమె 'క్యాబ్ స్టోరీస్', 'నయీం డైరీస్' వంటి చిత్రాలతో మెప్పించింది. అలాగే, చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఇందులో ఈ పిల్ల అదరగొట్టేసింది. ఇక, ఇటీవలే దివి వాధ్యా 'లంబసింగి' అనే సినిమా చేసింది. ఈ చిత్రం మార్చి 15వ తేదీన విడుదలైంది. కానీ, ఇది పెద్దగా ఆకట్టుకోలేదు.

దావత్ షోలోకి వచ్చారు:రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న 'దావత్' షోలో భాగంగా కొత్త ఎపిసోడ్ కోసం 'లంబసింగి' మూవీ టీమ్ తరపున దివి వాధ్యా హీరోతో కలిసి ఎంట్రీ ఇచ్చింది. ఈ ప్రోమో ఇటీవలే విడుదలైంది. ఇందులో దివి వాధ్యా తన పర్సనల్ విషయాలు, కష్టాలను పంచుకుంది. ముఖ్యంగా 'లంబసింగి' మూవీకి ముడిపడినట్లే తన ప్రేమకథను కూడా ఈ షోలో గుర్తు చేసుకుంది.
రవితేజ మూవీలో రిజెక్ట్:'దావత్' షోలో భాగంగా దివి వాధ్యా 'నా కెరీర్‌లో చాలా ఆఫర్లు వచ్చినట్లు వచ్చి పోయాయి. నేను సన్నగా ఉన్నానని రిజెక్ట్ చేశారు. లావు అయ్యానని రిజెక్ట్ చేశారు. వాళ్లు సన్నగా అవమన్నారు.. అయ్యాక రిజెక్ట్ చేశారు. రవితేజ గారి పక్కన ఫుల్ లెంగ్త్ రోల్‌కు నన్ను సెలెక్ట్ చేశారు. ఇంకో ఐదు రోజుల్లో షూటింగ్ అనగా రాత్రికి రాత్రే అమ్మాయి మారిపోయింది' అని చెప్పుకొచ్చింది.
కామెంట్స్ అన్నీ అలా:అదే షోలో దివి వాధ్యా కంటిన్యూ చేస్తూ.. 'నేను ఆ మధ్య శేఖర్ మాస్టర్ గారితో ఓ ఫోక్ సాంగ్ చేశాను. దానికి కామెంట్స్ అన్నీ నెగెటివ్‌గానే వచ్చాయి. ఒక్క కామెంట్ కూడా పాజిటివ్‌గా లేదు. దీనికి డ్యాన్స్ రాదు. ఇదేంటి ఇలా ఉంది? దీనికి ఎక్స్‌ప్రెషన్స్ రావు అని ఎన్నో కామెంట్లు పెట్టారు. నేను ఎన్నో ఆడిషన్లకు వెళ్లాను. కానీ, ఇంటికి వెళ్లిన తర్వాత ఫోన్ రాలేదు' అని బాధపడింది.
బాత్రూంలో అలా చేశా:ఆ తర్వాత దివి వాధ్యా మాట్లాడుతూ.. 'నాకు ఆఫర్లు వచ్చినట్లే వచ్చి పోతుంటే.. నేను బాలేనా? నాలో ఏమైనా ఫాల్ట్ ఉందా? నా యాక్టింగ్ బాలేదా అనుకునేదాన్ని. బాత్రూంలో షవర్ ఆన్ చేసి మా వాళ్లకు వినిపించకుండా ఎన్నో సార్లు ఏడ్చాను. దిండును ముఖానికి నొక్కుకుని ఏడ్చాను. ఇప్పుడు అది తలచుకుంటే అదే ఫీలింగ్ వస్తుంది. అలా వస్తే నేను తట్టుకోలేను' అని చెప్పింది.


Click it and Unblock the Notifications











