twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీలో కనువిందు చేసేందుకు రెడీ.. ఆ సినిమాలో నటించొద్దని అందరూ అన్నారు.. లావణ్య కామెంట్స్

    |

    అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి. అయితే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రాజెక్ట్‌నల్లా ఓకే చేయడంతో వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో ఒక్కసారిగా రేసులో వెనక్కి వెళ్లిపోయింది. మధ్యలో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కినా.. అదృష్టం అంతగా కలిసి రాలేదు. చాలా రోజుల వరకు ఒక్క హిట్ కూడా లేకపోవడం నిరాశ చెందింది. చివరగా అర్జున్ సురవరం సినిమాతో మళ్లీ విజయాన్ని దక్కించుకుంది. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది. అవేంటో ఓ సారి చూద్దాం.

    అలా గడిపేస్తున్నా..

    అలా గడిపేస్తున్నా..

    ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తున్నారని అడిగితే.. చుట్టుపక్కల వారి సాయంతో మాస్కులు తయారు చేస్తున్నానని, అవసరమైన వారికి వాటిని అందజేస్తున్నట్టు తెలిపింది. ఇంట్లోనే వంటలు వండి చుట్టుపక్కల వారికి పంపిణీ చేస్తున్నానని పేర్కొంది. వెబ్ సిరీస్‌లు చూస్తూ మిగతా సమయాన్ని గడుతున్నాని అంది. నెట్‌ఫ్లిక్స్‌లో డార్క్ అనే వెబ్ సిరీస్‌ చూడమని సలహా కూడా ఇచ్చింది.

    కొన్ని తప్పులు చేశా..

    కొన్ని తప్పులు చేశా..

    కెరీర్ ప్రారంభంలో కొన్ని తప్పులు చేశానని తెలిపింది. కొన్ని చిత్రాలను తన ప్రమేయం లేకుండా పరిస్థితుల వల్ల చేయాల్సి వచ్చిందని పేర్కొంది. కానీ ప్రతీ తప్పులోంచి ఎంతో నేర్చుకున్నానని, ప్రస్తుతం సొంతంగా నిర్ణయాలు తీసుకునే దశకు చేరుకున్నానని పేర్కొంది.

    బికినీ కూడా ధరిస్తా..

    బికినీ కూడా ధరిస్తా..

    కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్స్, బికినీ ధరించేందుకు కూడా సిద్దమేనని పేర్కొంది. ఓ నటిగా సవాళ్లను ఎదుర్కొనేందుకు తానెప్పుడూ సిద్దంగానే ఉంటానని, కథ డిమాండ్ చేస్తే అలాంటి పాత్రలను చేసేందుకు తాను రెడీ అని తెలిపింది.

    ఆ సినిమాలో నటించొద్దు..

    ఆ సినిమాలో నటించొద్దు..

    సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నటించొద్దని అందరూ సలహా ఇచ్చారని తెలిపింది. సీనియర్ హీరో పక్కన నటిస్తే.. మళ్లీ అలాంటి పాత్రలే వస్తాయని కెరీర్ దెబ్బతింటుందని అందరూ అన్నారని పేర్కొంది. ఇదే విషయాన్ని నాగార్జునకు కూడా చెబితే.. ఆయన అన్నీ వివరించి ఒప్పించాడని వెల్లడించింది. ఆ సినిమాతో తనకు మంచి పేరు వచ్చిందని, అందుకే ఇప్పటికీ ముఖ్యమైన నిర్ణయాల్లో నాగ్ సలహా తీసుకుంటానని తెలిపింది.

    English summary
    Lavanya Tripathi ABout Bold Characters And Wearing Bikini. I am an actor and love to get challenged through my roles. I don’t mind doing bold scenes and wearing a bikini unless the scenes and script have a good sense in it and the right narration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X