అతడు నిజమైన హీరో.. ధైర్యంగా నిలబడతాడు.. మెగా హీరోలపై లావణ్య త్రిపాఠీ కామెంట్స్

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది లావణ్య త్రిపాఠి. ఆపై కమర్షియల్ చిత్రాల్లో కనిపించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అందం, అదృష్టం, ప్రతిభ ఉన్న హీరోయిన్ అనిపించుకుని వరుసగా అవకాశాలను అంది పుచ్చుకుంది. మధ్యలో కొన్ని గడ్డు పరిస్థితులు ఏర్పడినా.. చివరగా అర్జున్ సురవరం సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లతో చిట్ చాట్ చేసిన లావణ్య.. అనేక విషయాలను పంచుకుంది. టాలీవుడ్ హీరోలు.. ముఖ్యంగా మెగా హీరోలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం..

 బ్రహ్మానందం జిఫ్ కింగ్..

బ్రహ్మానందం జిఫ్ కింగ్..

శ్రీదేవీ, మాధురి దీక్షిత్‌లు తనకు స్ఫూర్తి అని, నాగ్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే.. కింగ్‌లా బతకాలి (లివ్ లైఫ్ కింగ్ సైజ్) అని నాలుగు ముక్కల్లో చెప్పినందుకు క్షమించమని అడిగింది. నాని మంచి సహచర నటుడని, వరుణ్ తేజ్ సూపర్ టాలెంటెడ్ అని, రవితేజ ఫన్నీ అని, బ్రహ్మానందాన్ని.. జిఫ్ కింగ్ అని చెప్పుకొచ్చింది. ఇక తమిళ్‌లో చాలా మంది ఇష్టమని చెప్పినా.. విజయ్ సేతుపతి మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఇష్టమని తెలిపింది.

పుష్ప లుక్ చింపేసింది..

పుష్ప లుక్ చింపేసింది..

ప్రభాస్ పేరెత్తగానే చాలా కూలెస్ట్ గా ఉంటాడని చెప్పింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరూ మ్యాచ్ చేయలేరని, ఆయన తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్' లో లుక్ కోసం వెయిట్ చేస్తున్నానంది. షారూఖ్ నటించిన చిత్రాల్లో 'చక్ దే ఇండియా' ఇష్టమని వెల్లడించింది. అల్లు అర్జున్ పేరు ప్రస్తావనకు రాగానే, 'పుష్ప' ఫస్ట్ లుక్ చింపేసిందని, ఇంకో బ్లాక్ బస్టర్ ఖాయంగా వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పింది.

 ఆ సినిమా షూటింగ్ సరదాగా..

ఆ సినిమా షూటింగ్ సరదాగా..

ప్రస్తుతం పాతాల్ లోక్ వెబ్ సిరీస్ చూశానని అద్బుతంగా ఉందని చెప్పుకొచ్చింది. తాను ఫోన్‌లో క్విజ్ అప్ గేమ్ ఆడుతానని, భలే భలే మగాడివోయ్ సినిమా షూటింగ్ భలే సరదాగా గడిచిందని చెప్పుకొచ్చింది. నైనిటాల్ అంటే ఇష్టమని, ప్రస్తుతం బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నానని తెలిపింది.

Recommended Video

Puri Jagannath's Wife Slapped Him & The Reason Is Megastar Chiranjeevi
 మెగా హీరోలపై కామెంట్స్

మెగా హీరోలపై కామెంట్స్

పవన్ కల్యాణ్, ప్రతి విషయంపైనా స్పందిస్తారని, ఆయన ధైర్యంపై తనకు ఎంతో గౌరవం ఉందని, నిజమైన హీరో అని కామెంట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతూ.. తాను ఆరాధించే నటుల్లో ఆయన ఒకరని తెలిపింది. ఆయన చాలా మంచి వ్యక్తని, ఆయనలోని దయాగుణం, వినయం తనకు ఆదర్శమని పేర్కొంది. రామ్ చరణ్ అంటే ఓ అద్భుతమని, ఆయన నటించిన 'రంగస్థలం' తనకు చాలా ఇష్టమైన సినిమా అని, వరుణ్ తేజ్ సూపర్ టాలెంటెడ్ అని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X