అలాంటిదొకటి ఉందని తెలుసుకున్నా.. చేసే ఫస్ట్ పని అదే.. క్వారంటైన్‌పై హీరోయిన్ కామెంట్స్

అందాల రాక్షసితో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది లావణ్య త్రిపాఠి. అందం, అదృష్టం ఉన్న లావణ్య టాలీవుడ్‌లో మంచి అవకాశాలనే దక్కించుకుంది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన వంటి సూపర్ హిట్స్ చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. చివరగా అర్జున్ సురవరం సినిమాతో పలకరించింది. చాలా రోజుల తరువాత ఓ సూపర్ హిట్‌ను అందుకుంది లావణ్య. ప్రస్తుతం లాక్ డౌన్‌లో ఉన్న లావణ్య.. తన అనుభవాల గురించి ఓ మీడియాతో పంచుకుంది. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

అలాంటిదొకటి ఉందని..

అలాంటిదొకటి ఉందని..

ఈ క్వారంటైన్ వల్ల.. మాస్టర్‌ క్లాస్‌ అని ఒక యాప్‌ ఉంద, అది కూడా తర ఫ్రెండ్‌ ద్వారా దాని గురించి తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. రచన, సినిమాలు, సంగీతం, రాజకీయాలు, కళలు, క్రీడలు... ప్రపంచంలోని ప్రతి రంగంలోని ప్రముఖులు చాలామంది అందులో క్లాసులు చెబుతుంటారని తెలిపింది. ఆ వీడియోలు చూస్తున్నానని అలా సమయం గడిపేస్తున్నానని పేర్కొంది.

ఇప్పటికి పదిసార్లు చూశా..

ఇప్పటికి పదిసార్లు చూశా..

నచ్చిన సినిమాలను మళ్లీ మళ్లీ చూసే అలవాటు ఉందని లావణ్య చెప్పుకొచ్చింది. ‘జోకర్‌' (హాలీవుడ్‌) చిత్రాన్ని థియేటర్లలో పదిసార్లు చూశానని మళ్లీ చూశానని తెలిపింది. ఆ చిత్రం నుంచి మనమెంతో నేర్చుకోవచ్చని పేర్కొంది. ‘గాడ్‌ ఫాదర్‌' కూడా చూశానని, ఇటీవల రజనీకాంత్‌, మమ్ముట్టి, శోభన నటించిన ‘దళపతి' చూశానని బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.

అలాంటివి ఇష్టం..

అలాంటివి ఇష్టం..

ఎలాంటి వంటకాలు చేయడం, తినడం ఇష్టమని ప్రశ్నిస్తే.. ఛోళా భటోరా, పాస్తా చేయడం ఇష్టమని పేర్కొంది. ఉత్తరాది వంటలన్నీ చేస్తానని తెలిపింది. తినడానికి ఇష్టమైన వంట అంటే... దోసా-చట్నీ, అన్నం-పప్పు, మంచి సాంబర్‌ అని పేర్కొంది. ఇంటికి వెళ్లినప్పుడు అమ్మ నాన్న కోసం దోసలు వేస్తానని మామూలుగా ఇంట్లో పరోటాలు ఎక్కువ తింటామని తెలిపింది.

Recommended Video

Puri Jagannath's Wife Slapped Him & The Reason Is Megastar Chiranjeevi
మొదటగా చేసే పని అదే..

మొదటగా చేసే పని అదే..

క్వారంటైన్ ముగియగానే మొదటగా.. డెహ్రాడూన్‌ వెళ్లి అమ్మానాన్నను కలుస్తానని తెలిపింది. వాళ్లను చూసి చాలా రోజులైందని అయితే అంతకంటే ముందు హైదరాబాద్‌లో ఇంటి నుంచి బయటకు అడుగు పెడతానని పేర్కొంది. ఇక్కడి వీధుల్లో ఎలాగో తిరగలేను కాబట్టి.. అందుకని, ఫ్రెండ్‌ ఇంటికి వెళతానని తెలిపింది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉందో చూస్తానని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X