వరుణ్ తేజ్ పై లావణ్య త్రిపాఠీ కామెంట్స్.. మనసులో మాట చెబుతూ షాకింగ్ గా!
లావణ్య త్రిపాఠి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా అంటూ క్యూట్ అడిగి తెలుగు ప్రేక్షకులు మనసు దోచుకుంది ఈ చిన్నది. సీతా రామం డైరెక్టర్ హను రాఘవపూడి మొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా అందాల రాక్షసి. ఈ సినిమాలో పద్ధతిగా, ముద్దుగా, క్యూట్ గా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన చేసిన లావణ్య త్రిపాఠీకి ఆ మధ్య విజయాలు వరించలేదు. మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా దూసుకుపోతున్న లావణ్యపై మెగా వారసుడు వరుణ్ తేజ్ తో డేటింగ్ రూమర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వరుణ్ పై లావణ్య చేసిన కామెంట్స్ ఆ రూమర్స్ కు ఆజ్యం పోసేలా ఉన్నాయి.

అభిమానులను సొంతం చేసుకని..
అందాల రాక్షసి' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. అందులో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంది. తన క్యూట్‌నెస్‌తో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.

వరసుగా నిరాశ..
అందాల రాక్షసి వంటి మంచి హిట్ తర్వాత దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో అలరించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఇక ఈ సినిమాల తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన ఏ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. లచ్చిందేవికి ఓ లెక్కుంది, రాధ, ఇంటలిజెంట్, యుద్ధం శరణం, మిస్టర్, అంతరిక్షం, అర్జున్ సురవరం, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే వంటి చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి.

సంథింగ్.. సంథింగ్..
అలా లావణ్య త్రిపాఠి చేసిన ప్రతి సినిమా హిట్ కాకపోవడంతో.. సోషల్ మీడియాను నమ్ముకుంది. 3 మిలియిన్ ఫాలోవర్లు ఉన్న తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ షో చేస్తూ కనువిందు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠిపై అనేక రూమర్స్ వచ్చాయి. మెగా వారసుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని ఊహగానాలు చక్కర్లు కొట్టాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఫంక్షన్ లో లావణ్య కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.

మళ్లీ తెరపైకి రూమర్స్..
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కలిసి విన్నర్, అంతరిక్షం వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు హిట్టు కాలేదు గానీ వీళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రం పెరిగింది అని కామెంట్స్ వినిపించాయి. ఇక వరుణ్ తేజ్ తో డేటింగ్ రూమర్స్ పై నెటిజన్లు అడగ్గా వాళ్లకు స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. దీంతో ఆ రూమర్స్ కాస్తా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు మళ్లీ తెరపైకి ఆ రూమర్స్ వచ్చేలా తెలుస్తోంది.

డిజిటల్ పైకి ఎంట్రీ..
లావణ్య త్రిపాఠీ తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె తాజాగా నటించిన పులి-మేక సినిమాలో కిరణ్ ప్రభ అనే పోలీస్ అధికారి పాత్ర పోషించింది. లావణ్య మొదటిసారిగా పోలీస్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ ఫొరెన్సిక్ డాక్టర్ గా కనిపించనున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా విడుదల అవుతున్న ఈ సినిమా బృందం తాజాగా సుమ అడ్డా షోలో సందడి చేశారు. సుమ అడ్డా షోకి లావణ్య, రచయిత కోన వెంకట్, బిగ్ బాస్ సిరి హాజరయ్యారు.

వరుణ్ తేజ్ పేరు..
సుమ అడ్డా షోలో వివిధ ప్రశ్నలు, కామెడీతో సుమ అలరించింది. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠిని కొన్ని ప్రశ్నలు వేసింది. అందులో "మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అని అడిగితే వీరిలో ఎవరి పేరు చెబుతారు" అని నాని, వరుణ్ తేజ్ పేర్లు చెప్పింది యాంకర్ సుమ. అప్పుడు "నేను వరుణ్ తేజ్ పేరు చెబుతాను" అని లావణ్య త్రిపాఠి అంది. దీంతో అక్కడున్న వారందరూ అరుస్తూ గోల చేశారు. ప్రస్తుతం లావణ్య కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆమె చెప్పిన మాటతో డేటింగ్ రూమర్స్ మరింత పెరిగేలా ఉన్నాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











