మంచి పని చేసిన లావణ్య.. సోదరుడితో కలిసి అలా
ప్రస్తుతం టాలీవుడ్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫుల్ రచ్చ చేస్తోంది. రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్ టాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్‌కి కూడా పాకింది. ఇప్పటికే రెండు దశల్లొ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ అయింది. తాజాగా మూడో దశ గ్రీన్ఇండియా ఛాలెంజ్‌ను ప్రభాస్ చేత ప్రారంభించేలా చేశారు సంతోష్ కుమార్. ప్రభాస్ ప్రారంభించిన ఈ మూడో దశ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.
దాదాపు తెలుగు సినీ ప్రముఖులందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను తమ వంతుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఛాలెంజ్‌లో పాల్గొంటూ మొక్కలు నాటి.. మరి కొంత మందికి సవాల్‌ను విసురుతున్నారు. అలా పక్క రాష్ట్రాల్లోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాకింది. మహేష్ బాబు విసిరిన ఛాలెంజ్‌ను దళపతి విజయ్ స్వీకరించగా.. సంపత్ నంది విసిరిన సవాల్‌ను ఊర్వశీ రౌటేలా స్వీకరించింది. తాజాగా లావణ్య త్రిపాఠి కూడా ఈ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అయింది.

డైరెక్టర్ నందినీ రెడ్డి తనకుకు విసిరిన సవాల్‌ను లావణ్య పూర్తి చేసింది. ఈ మేరకు తన సోదరుడితో కలిసి దాదాపు 50 మొక్కలు నాటినట్టుగా తెలిపింది. ఇళలాంటి గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు నందినీ రెడ్డికి ధన్యవాదలను తెలిపింది. 50 మొక్కలను నాటేందుకు వీరందరిలో సాయాన్ని తీసుకున్నానని పేర్కొంది. రితూ వర్మ, కార్తికేయ, వెన్నెల కిషోర్, సైనా నెహ్వాల్ వంటి వారికి తదుపరి ఛాలెంజ్‌ను విసింది.


Click it and Unblock the Notifications











