శృంగారానికి లావణ్య త్రిపాఠి దూరం.. నిర్మాతలకు షాకిస్తున్న అందాల రాక్షసి

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ షూటింగులకు సిద్ధమవుతున్నది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే షూటింగుల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమాల చిత్రీకరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. అయితే సినిమా షూటింగుల్లో తారలు తగు జాగ్రత్తలు తీసుకొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్లు, ఇతర సన్నిహితంగా ఉండే సన్నివేశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

సురక్షిత చర్యలు తీసుకోవాలి

సురక్షిత చర్యలు తీసుకోవాలి

సినిమా పరిశ్రమలో ఇంతకు ముందులా కాకుండా అనేక మార్పులతో షూటింగులు జరుగుతాయి. అందరిలోనూ కరోనావైరస్ భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు సెట్స్‌లో సురక్షితంగా ఉండేందుకు, ఆరోగ్యపరంగా ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఏది ఏమైనా నా మట్టుకు నేను, నా పరిధిలో సురక్షిత ప్రమాణాలపై దృష్టి పెడుతాను అని అన్నారు.

లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగానే

లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగానే

లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత ప్రభుత్వం విధించిన ప్రమాణాలను, మార్గదర్శకాలను తప్పుకుండా పాటిస్తాను. నా చుట్టు ఉండేవారిని పాటించేలా చేస్తాను. శృంగారపరమైన, అతి సన్నిహితంగా ఉండే సీన్లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఈ మేరకు నిర్మాత, దర్శకులతో చర్చించి నిర్ణయం తీసుకొంటాం అని లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు.

 శృంగార సన్నివేశాలకు దూరంగా

శృంగార సన్నివేశాలకు దూరంగా

ప్రస్తుతం నెలకొన్న ప్రమాద పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా పరిశ్రమ కంటెంట్ విషయంలో జాగ్రత్త వహించాలి. అవనవసరంగా అశ్లీల, అసభ్య సన్నివేశాలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటెంట్ డిమాండ్ చేస్తే తప్ప శృంగార సన్నివేశాలను జొప్పించవద్దు అని లావణ్య త్రిపాఠి అభిప్రాయపడ్డారు.

Recommended Video

Puri Jagannath's Wife Slapped Him & The Reason Is Megastar Chiranjeevi
లావణ్య త్రిపాఠి కెరీర్

లావణ్య త్రిపాఠి కెరీర్

ఇక లావణ్య త్రిపాఠి కెరీర్ విషయానికి వస్తే.. గతేడాది రిలీజైన అర్జున్ సురవరంలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సందీప్ కిషన్‌తో ఏ1 ఎక్స్‌ప్రెస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా చావు కబురు చల్లగా, అలాగే కౌశిక్ దర్వకత్వంలో గీతా ఆర్ట్స్ రూపొందించే చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా అథర్వ నటించే తమిళ సినిమాలో లావణ్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X