అమ్మ బాబోయ్.. లావణ్య త్రిపాఠికి ఈ టాలెంట్ కూడానా?
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇప్పుడు రూట్ మార్చింది. తెరపై కొత్త కథలు, పాత్రలు చేసేందుకు ముందుకు వస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అందాల వల వేస్తోంది. హాట్ ఫోటో షూట్లతో అందాల ఆరబోతకు తెరదీస్తోంది. ప్రస్తుతం లావణ్య ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె టాలెంట్‌ను చూసి అందరూ ఫిదా అయ్యారు. బాస్కెట్ బాల్ ఆడటంతో లావణ్య ఆరితేరినట్టు కనిపిస్తోంది.
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో లావణ్య ఈ ఏడాది మంచి బోణీ కొట్టింది. ఈ మూవీ ఓ మోస్తరుగా మెప్పించింది. ఇందులో లావణ్య త్రిపాఠి హాకీ ప్లేయర్‌గా నటించింది. అయితే ఈ సినిమా కోసం లావణ్య హాకీ నేర్చుకుంది. అంతే కాకుండా బైక్ రైడింగ్ కూడా నేర్చుకుంది. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి తనలోని మరో కోణాన్ని చూపించింది. మొన్నటివరకు లావణ్య త్రిపాఠి నార్త్ టూర్ అంటూ చక్కర్లు కొట్టేసింది.

నిహారిక, చైతన్య, తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి ఉత్తరాఖండ్ మొత్తాన్ని చుట్టివచ్చేసింది. ఎలాగూ తన సొంతూరు కూడా అదే కాబట్టి అందరికీ తిప్పి చూపించినట్టుంది. అయితే తాజాగా లావణ్య బాస్కెట్ బాల్ ఆడటంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అంత దూరంలో నుంచి బాస్కెట్ బాల్‌ను విసిరినా కూడా కరెక్ట్‌గా బాస్కెట్‌లో పడింది. దీంతో ఆమె టాలెంట్‌ను చూసి అందరూ అమ్మ బాబోయ్ అనుకుంటున్నారు. చావు కబురు చల్లగా అనే సినిమా లావణ్య త్రిపాఠికి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది.


Click it and Unblock the Notifications











