పెళ్లి చేసుకుంటావా? మెగా కోడలికి లవ్ ప్రపోజల్.. అభిమానికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన లావణ్య

మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది ఈ యూపీ భామ. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టి తన ఫ్యాన్స్ గా మార్చేసుకుంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసినా లావణ్యకు మాత్రం అంతగా స్టార్ డమ్ దక్కలేదు.

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. త్వరలో పెళ్లి అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను లావణ్య త్రిపాఠి కొట్టిపారేసింది. కానీ, చివరకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్ళాడి ఎట్టకేలకు మెగా కోడలుగా మారింది. పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. లావణ్య పెళ్లి తరువాత మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ఆమెకు మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది.

lavanya tripathi befitting reply to fan over marriage proposal

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న లావణ్యకు ఈ మధ్యనే షూటింగ్ లో కాలుకు గాయం అయిన సంగతి తెల్సిందే. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి లావణ్య త్రిపాఠి హాజరు కాకపోవడం కారణం ఇదే. అయితే కాలు బెణకడం వల్ల ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న లావణ్య ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపిగ్గా సమాధానం ఇచ్చింది.

ఇంట్లో ఉన్నవారందరి గురించి ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న అడిగారు. డిప్యూటీ సీఎం గారి గురించి చెప్పమని అడగ్గా.. పవర్ అని చెప్పుకొచ్చింది. ఇక ఆడపడుచు నిహారిక గురించి అడిగితే బెస్టీ అని తెలిపింది. తాను నటించిన మూవీస్ లో టఫ్ సినిమా ఏది అంటే మొదటి సినిమానే అని చెప్పి షాక్ ఇచ్చింది.

అందాల రాక్షసి సమయంలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని, ఆ సమయంలో భాషకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అంతేకాకుండా ఆ సమయంలో మెట్లపై నుంచి కింద పడ్డానని, వ్యానిటీ వ్యాన్ కూడా లేదని గుర్తుచేసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని అడిగిన చిలిపి ప్రశ్నకు లావణ్య దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.

lavanya tripathi befitting reply to fan over marriage proposal

లావణ్య గారు మీరంటే చాలా ఇష్టం. ఈ జన్మలో వేరొకరిని పెళ్లి చేసుకున్నారు. కనీసం వచ్చే జన్మలో అయినా మనం పెళ్లి చేసుకుందాం అని అడగ్గా.. దానికి సమాధానంగా లావణ్య.. " హిందూ శాస్త్రం ప్రకారం పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. అలాగే ఈ జన్మకే కాదు ఏడు జన్మలకు నా భర్త వరుణ్ తేజ్ మాత్రమే" అని చెప్పుకొచ్చింది.

ఇక ఈ మాటలకూ మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మెగా కోడలు ఎంతో అద్భుతంగా సమాధానం చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్య చిట్ చాట్ ముచ్చట్లు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ముందు ముందు లావణ్య పెద్ద సినిమాలు చేస్తుందా.. ? వెబ్ సిరీస్ లతోనే సరిపెట్టుకుంటుందా అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X