'లావణ్య త్రిపాఠి'ని చీప్ అన్న నెటిజన్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి నోరుమూయించిన లావణ్య!

తెలుగులో అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే తాజాగా ఆమె అనూహ్యంగా వార్తల్లోకి వచ్చింది. ఆమెను ఒక వ్యక్తి చవకబారు నటి అనడంతో అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

అవకాశాలు తగ్గుముఖం

అవకాశాలు తగ్గుముఖం

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ రంగప్రవేశం చేసిన లావణ్య త్రిపాఠి దూసుకెళ్తా అనే సినిమా కూడా చేయగా ఆ పాత్ర ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేక పోయింది. ఆ తర్వాత ఏడాది బ్రహ్మ అనే సినిమా ద్వారా తమిళ సినిమా రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించినా ఆ సినిమా కూడా ఆమెకు వర్కౌట్ కాలేదు.

అవకాశాలు తగ్గుముఖం

అవకాశాలు తగ్గుముఖం

ఆ తర్వాత ఏడాది మారుతి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన బలే బలే మగాడివోయ్ సినిమా ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా సోగ్గాడే చిన్ని నాయనా, లచ్చిందేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తూ శుభమస్తూ, మిస్టర్, రాధా, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్, అంతరిక్షం 9000 KMPH, అర్జున్ సురవరం, ఏ వన్ ఎక్స్ప్రెస్ లాంటి సినిమాల్లో నటించి తెలుగులో స్థిరపడింది. కానీ ఆ తరువాతే ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఆమె చివరిగా చేసిన చావు కబురు చల్లగా సినిమా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.

చులకన చేసి

చులకన చేసి

ఇప్పుడు అనూహ్యంగా ఆమె వార్తల్లోకి ఎక్కింది. మతమార్పిడికి బలవంతం చేశారంటూ లావణ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు లావణ్య అని అనడం బదులుగా హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి అనే హ్యాష్‌ట్యాగ్‌ వాడుతున్నారు. మరి ఏమనుకున్నాడో ఏమో కానీ ఓ నెటిజన్‌ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిను చులకన చేసి మాట్లాడాడు.

తీవ్రంగా స్పందిస్తూ

తీవ్రంగా స్పందిస్తూ


'లావణ్య త్రిపాఠి అనే హ్యాష్‌ట్యాగ్‌ వాడకండి. లావణ్య తమిళనాడుకు చెందిన సాధారణ దళిత అమ్మాయి, లావణ్య త్రిపాఠి ఒక చౌకబారు నటి. ధర్మం కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఆమెను ఆ హీరోయిన్‌తో పోల్చకండి' అని దురుసుగా ఒక ట్వీట్ చేసాడు. దీనిపై తీవ్రంగా స్పందిస్తూ లావణ్య త్రిపాఠి ట్వీట్ చేసింది.

 గౌరవించడం నేర్చుకో

గౌరవించడం నేర్చుకో


'నీలాంటి వాళ్లు అమ్మాయిల గురించి చీప్‌గా మాట్లాడతారు. కానీ ఏదైనా చెడు జరిగితే మాత్రం వెంటనే ఎక్కడలేని గౌరవాన్ని చూపిస్తారు. ముందు ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్చుకో! ఇది చాలా బాధాకరమైన సంఘటన. కానీ సమాజంలోని వాస్తవ పరిస్థితి ఇదే!' అని ఆమె దిమ్మతిరిగే విధంగా సమాధానం ఇచ్చింది. ఇక లావణ్య ప్రస్తుతానికి తెలుగులో హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ సినిమా ఆమెకు ఎంతలా కలిసి వస్తుందని అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X