Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సినిమాలో రొమాన్స్ చేసి.. స్టేజ్ పైన హీరోను 'అన్న' అనేసిన హీరోయిన్.. అందరూ షాక్
సెలబ్రెటీలు కాస్త పొరబడి మాట్లాడినా కూడా ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. తప్పులు కొంచెం దొరికినా కూడా మీమర్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చినట్లే లెక్క. ఇక ఇటీవల అందాల రాక్షసి కూడా అలాంటి పొరపాటే చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యువ హీరోను అన్న అనేసింది. దీంతో ఒక్క నిమిషం పాటు అందరు షాక్ అయ్యారు. ఇక ఆ అందాల రాక్షసి మరెవరో కాదు.. లావణ్య త్రిపాఠినే..
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన లావణ్య త్రిపాఠి తన రేంజ్ ను మెల్లమల్లగా పెంచుకుంటోంది. కెరీర్ మొదట్లోనే ఈ అందాల రాక్షసి తన సొట్ట బుగ్గల అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తెలుగు తమిళ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటూ ముందుకు సాగుతోంది.
వరుసగా 7 అపజయాలు
లావణ్య త్రిపాఠి గత ఏడాది అర్జున్ సురవరం సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు అమ్మడు కొన్ని డిజాస్టర్స్ తో సతమతమయ్యింది. 2017లో మిస్టర్ నుంచి 2018 లో అంతరిక్షం వరకు వరుసగా 7 అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కొన్ని సినిమాల్లో ఆమె నటనకు మంచి క్రేజ్ దక్కింది.
హీరోను అన్నా అనేసింది
ఇక ఇప్పుడు లావణ్య త్రిపాఠి తన ఆశలన్నిటిని కూడా A1 ఎక్స్ ప్రెస్ పైనే పెట్టుకుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య హీరోను అనుకోకుండా అన్న అనేసింది. ఆ తరువాత మళ్ళీ తన మాటలతోనే మ్యానేజ్ చేసింది కూడా.
తెలివిగా కవర్ చేసిన హీరోయిన్
లావణ్య మాట్లాడుతూ.. A1 ఎక్స్ ప్రెస్ నా మనసుకు బాగా నచ్చిన సినిమా. కథ వినగానే వెంటనే ఒప్పేసుకున్నాను. కోవిడ్ ఉన్నా కూడా కష్ట సమయంలోనే సినిమాను పూర్తి చేశాము. హీరో 'సందీప్ అన్నా' గురించి చెప్పాలి అంటే.. అంటూ సడన్ గా లావణ్య షాక్ ఇచ్చింది. హీరోను అన్న అనడం కరెక్ట్ కాదని, అతను నాకు అన్నా కాదు. మీకు అన్న అంటూ మళ్ళీ తెలివిగా వివరణ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆమె కామెంట్స్ పై అనేక రకాల మీమ్స్ వస్తున్నాయి.