కంగారులో రాంచరణ్‌ని మరచిపోయా.. లావణ్య త్రిపాఠి!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. అదితి రావు హైదరి వ్యోమగామి పాత్రలో నటిస్తోంది. ఘాజి చిత్రంతో అబ్బురపరిచిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. స్పేస్ మిషన్ కి సంబంధించిన ఉత్కంఠభరితమైన కథతో అంతరిక్షం టీం మనముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేసింది.

ఇటీవల నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. లావణ్య త్రిపాఠి తాజాగా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. మా సినిమా ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన రాంచరణ్ గురించి మాట్లాడడం మరచిపోయాను. కంగారులో అలా జరిగిపోయింది. రాంచరణ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. రాంచరణ్ చెప్పిన మాటలు అంతరిక్షం చిత్ర యూనిట్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అందుకు చరణ్ కు కృతజ్ఞతలు అని లావణ్య త్రిపాఠి ట్వీట్ చేసింది.

Lavanya Tripathi forgot Ram charan at Antariksham Prerelease event

దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, రాజీవ్ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నాడు. జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా వచ్చింది అని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది. టాలీవుడ్ లో తొలి స్పేస్ సైన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X