మా ఫ్యామిలీ జోలికి వస్తే అస్సలు ఊరుకోను.. మెగా కోడలు స్ట్రాంగ్ వార్నింగ్
మెగా కుటుంబాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై మరోసారి గట్టిగా స్పందించారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఇటీవల రామ్ చరణ్ - ఉపాసన (Ram Charan - Upasana Kamineni) దంపతులకు కవలలు పుట్టిన సందర్భంగా కొందరు నెటిజన్లు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో చిరంజీవి సరదాగా చేసిన 'వారసుడు కావాలి' అనే కామెంట్స్‌ను ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటూ ట్రోల్స్ చేయడం ప్రారంభమైంది. ఈ విషయంపై లావణ్య త్రిపాఠి మరోసారి తన స్టాండ్‌ను వెల్లడించారు
గతేడాది 'బ్రహ్మానందం' సినిమా ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. ఇంటికి వెళ్తే లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉంటుందంటూ సరదాగా కామెంట్స్ చేశారు. పరోక్షంగా 'వారసుడు కావాలి'అంటూ సరదాగా తన కోరిక చెప్పారు. కానీ, అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు పుట్టిన సందర్భంగా కొందరు.. చిరంజీవిని టార్గెట్ చేస్తూ.. అవే వీడియోలను తిరగదోడుతూ, 'అబ్బాయి పుట్టగానే ఇంత హడావిడి ఎందుకు?' అంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు.

దీనిపై లావణ్య స్పందిస్తూ.. 'ఇంత సంతోషకరమైన క్షణాన్ని కూడా విషపూరితంగా మార్చడం చాలా బాధాకరం. చిరంజీవి గారు కుటుంబ విలువలు, మహిళల పట్ల ఆయన చూపించే గౌరవం గురించి బయటివాళ్లకు అవగాహన లేదని చెప్పారు. ఆయన చేసే పనుల్లో ఒక్క శాతం కూడా చేయలేని వాళ్లు ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదు. ముఖ్యంగా మనవరాళ్లను ఎంత ప్రేమగా చూసుకుంటారో మీకు తెలియదు. తెలియకుండా ఇలాంటి కామెంట్స్ చేయకండి' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మెగా కోడలిగా కుటుంబానికి అండగా నిలబడిన లావణ్య వైఖరిని మెగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
తాజాగా ఈ విషయంపై లావణ్య త్రిపాఠి మీడియా మరోసారి ప్రశ్నించగా, మరింత స్పష్టంగా తన స్టాండ్‌ను వెల్లడించారు. 'నా జీవితంలో నాకు అండగా నిలిచిన మంచి అబ్బాయిలు చాలామంది ఉన్నారు. అందరూ నాకు సపోర్ట్ చేశారు. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు చేసే ట్వీట్లు చాలా బాధిస్తాయి. ఒక కుటుంబం ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో అలాంటి నెగెటివ్ కామెంట్స్ ఎందుకు? అవి అసలు అవసరమా? అది పూర్తిగా బ్యాడ్ ట్వీట్. ఇది నా ఫ్యామిలీ. నా కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు... నేను ఊరుకోను," అంటూ లావణ్య గట్టిగా చెప్పుకొచ్చింది.
ఈ వ్యాఖ్యలతో మెగా ఫ్యామిలీపై ఆమెకున్న ప్రేమ, గౌరవం మరోసారి బయటపడిందని అభిమానులు అంటున్నారు. కోడలిగా కుటుంబానికి ఇంత ప్రాధాన్యం ఇస్తోందంటూ లావణ్యను ప్రశంసిస్తూ ఆమె కామెంట్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. మొత్తం మీద... కుటుంబం విషయంలో రాజీపడని లావణ్య స్టాండ్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
'సతీ లీలావతి'పై ఆసక్తి
ఇక సినిమాల విషయానికి వస్తే... లావణ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ సతీ లీలావతి (Sathi Leelavathi) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆమె సరసన మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇలా లావణ్య ఒకవైపు నటిగా కెరీర్ కొనసాగిస్తూనే, మరోవైపు కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ఆమె తీసుకున్న స్టాండ్ మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











