న్యాయం కోసం మెగా కోడలు సోషల్ మీడియా పోరాటం.. లావణ్య త్రిపాఠి షాకింగ్ పోస్ట్
సినీ పరిశ్రమల్లో ప్రేమ పెళ్లిళ్లు చాలానే చూస్తూ ఉంటాం. మరి బాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర డేటింగ్ కి ప్రేమలు, ఆ పై ఉంటే పెళ్లి లేకపోతే బ్రేకప్ లాంటివి ఉంటాయి. కాగా ఇదే ట్రెండ్ మన సౌత్ లో కూడా ఉంది. ఇలా ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు హీరోయిన్స్ ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన వారు కూడా లేకపోలేరు. అయితే రీసెంట్ గానే అక్కినేని వారసుడు నాగ చైతన్య తన రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఇలా చాలా ప్రముఖ కుటుంబాల హీరోలు ఈ ప్రేమ పెళ్లిళ్లలో బిజీగా ఉండగా వారిలో మెగా యువ హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకడు. కాగా మెగా బ్రదర్స్ ఇంట ఇపుడు ఇద్దరు కోడళ్ళు ఉన్న సంగతి తెలిసిందే. ఒకరు రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులు అయితే వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాటిల జంట కూడా ఒకటి. మరి సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పటికప్పుడు ఆక్టివ్ గానే ఉంటారు.

అలానే రీసెంట్ గానే ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి కొణిదెలలు కూడా ఉన్నారు. అయితే ఉపాసనతో పాటుగా లావణ్య కూడా ఇపుడు సోషల్ మీడియాలో కొంచెం ఆక్టివ్ గానే ఉంటుంది. సినిమాలకి దూరం అయ్యింది కానీ సోషల్ మీడియాలో లేటెస్ట్ గా ఓ దారుణ ఘటనపై స్పందిస్తూ తన సంఘీభావాన్ని వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ఉన్న రోజుల్లో నిజాయితీగా పని చేసే వారికి ఎంత కష్టతరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక మనిషి నిజాయితీ వారి ప్రాణాలని కూడా హరిస్తుంది. అయితే ఇలాంటిది మీడియాలో నిజాయితీగా పనిచేసే రిపోర్టర్స్ కూడా ఎంతో కరువయ్యారు. అయితే హిందీ మీడియాకి చెందిన ఓ ప్రముఖ రిపోర్టర్ ముకేశ్ చంద్రకర్ ఛత్తీస్ ఘడ్ లో జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు.
కాగా తాను తన వృత్తి పరంగానే అక్కడి రోడ్లు నిర్మాణ పనుల్లో జరిగిన భారీ స్కాంని చేసిన నేపథ్యంలో తాను కీలక ఆధారాలు సంపాదించి అందరికీ తెలిసేలా చేస్తున్నాడని అక్కడి లోకల్ లీడర్స్ అతన్ని దారుణంగా హతమార్చి సెప్టిక్ ట్యాంక్ లో పడేశారట. ఇంతకన్నా దారుణ విషయం ఆ అవినీతిలో తన బంధువులు కూడా ఉన్నారని నార్త్ వర్గాల వార్తలు చెబుతున్నాయి.
దీనితో ఇలాంటి నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ ని చంపడం అనేది దారుణం అని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ట్రెండ్ నడుస్తుంది. మరి దీనికి మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల కూడా హాష్ టాగ్ తో అతడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంది. మరి సినీ తారలు ఇలాంటి అంశాల్లో మాట్లాడ్డం ఒకింత అరుదు అలాంటిది లావణ్య తన గళం విప్పడంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ మధ్య సమంత కూడా ఓ లేడీ డాక్టర్ దారుణ ఘటన విషయంలో తన మద్దతు తెలిపింది.
#JusticeForMukeshChandrakar https://t.co/YJSYAhYgVm
— Lavanyaa konidela tripathhi (@Itslavanya) January 11, 2025


Click it and Unblock the Notifications











