లావణ్య చేతిలో పండంటి బిడ్డ.. వివరాలు వెల్లడించిన హీరోయిన్
లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాక్ డౌన్ సమయంలో లావణ్య చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఓ సారి ఆమె షేర్ చేసిన ఫోటో ఫ్యాన్స్‌ను బాగా హర్ట్ చేసింది. వెండితెరపై అంతగా అందాలను ఆరబోయని లావణ్య.. సోషల్ మీడియాలో హాట్ ఫోటోను షేర్ చేసే సరికి తెగ బాధపడ్డారు. ఇలా లాక్ డౌన్‌లో లావణ్య తెగ హల్చల్ చేసింది. ఇన్ని రోజులు హైద్రాబాద్ చిక్కుకున్న లావణ్య ఈ మధ్యే కుటుంబం వద్దకు చేరుకుంది.
లాక్ డౌన్ సమయాన్ని లావణ్ త్రిపాఠి హైద్రాబాద్‌లోనే గడిపింది. సీసీసీకి లక్ష రూపాయల విరాళాన్ని ఇవ్వడమే కాకుండా.. చేతనైన సాయాన్ని చేసింది. చుట్టు పక్కల వారి సాయంతో మాస్కులను తయారు చేసి అవసరమైన వారికి అందించింది. ఆపదలో ఆదుకుని మంచి మనసును చాటుకుంది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఈ మధ్యే డెహ్రాడూన్‌లోని కుటుంబం వద్దకు చేరుకుంది. కుటుంబాన్ని చూసేందుకు వెళ్లడటానికి లావణ్య బాగానే కష్టపడింది. ఊపిరి ఆడకపోయినా పీపీఈ కిట్ ధరించి నానా ఆపసోపాలు పడింది.

ప్రస్తుతం లావణ్య ఇంట్లో ఫుల్ సందడి చేస్తోంది. ఇంటి సభ్యులతో కలిసి ఆడిపాడుతోంది. ఇంట్లో ఉన్న కుక్కలతో ఆడుతూ, ఇంటి సభ్యులతో మసాజ్‌లు చేయించుకుంటూ రాజభోగాలు అనుభవిస్తోంది. లావణ్య తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో తన చేతిలో ఓ పండంటి బిడ్డ ఉంది. ఆ బిడ్డను చూస్తూ లావణ్య తెగ సంబర పడిపోతోంది. ఆ బిడ్డ వివరాలను చెబుతూ.. నా ప్రియ స్నేహితుడు, మేనేజర్ సీతారాం కూతురు.. ఎంతో అందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. లావణ్య ప్రస్తుతం కార్తికేయ హీరోగా రాబోతోన్న చావు కబురు చల్లగా చిత్రంలో నటిస్తోంది. చివరగా అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ కొట్టింది.


Click it and Unblock the Notifications











