అమ్మ మనసు అంతే మరి.. లావణ్య త్రిపాఠి పోస్ట్ వైరల్
సాటి మనిషిని ప్రేమించడం సాధారణ విషయమే. అయితే మూగ జంతువులను ప్రేమగా చూసుకోవడం మాత్రం కొందరికే సాధ్యం. ఈ విషయంలో సెలెబ్రిటీలు మాత్రం ముందుంటారు. ప్రతీ ఒక్కరి ఇంట్లో మూగ జీవులుంటాయి. కొందరు విదేశాల నుంచి ప్రత్యేక జాతులను కూడా దిగుమతి చేసుకుంటారు. అయితే లావణ్య త్రిపాఠి తన తల్లి మనసు గురించి చెప్పుకొచ్చింది. తన తల్లి కూడా మూగ జీవాల పట్ల ప్రేమను చూపుతుందని తెలిపింది.
లావణ్య త్రిపాఠి ఇన్ని రోజులు హైద్రాబాద్‌లోనే ఉంది. లాక్ డౌన్ కాలంలో చేతనైనా సాయాన్ని చేసి మంచి మనసును చాటుకుంది. కుటుంబాన్ని చూడక చాలా రోజులవుతుందని భావించిన లావణ్య.. తాజాగా ఇంటికి పయనమైంది. డెహ్రాడూన్‌లోని తన కుటుంబాన్ని కలుసుకునేందుకు లావణ్య బయల్దేరింది. పూర్తిగా సురక్షితమైన జాగ్రత్తలు తీసుకుని లావణ్య సొంత గూటికి వెళ్లింది.

దేశం మొత్తం కరోనా విజృంభిస్తుండటంతో లావణ్య పీపీఈ కిట్ ధరించి ఎన్నో జాగ్రత్తలను తీసుకుని బయల్దేరింది. అయితే ఈ కిట్ ధరించడం వల్ల ఊపిరి కూడా ఆడటం లేదని చెప్పుకొచ్చింది. అయినా అన్నింటిని ఓర్చుకుని ఎంచక్కా ఇంటికి చేరుకుంది. ఇక ఇంట్లో లావణ్య బాగానే సందడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా లావణ్య తన అమ్మ గురించి చెప్పుకొచ్చింది. ఇంట్లో కుక్కలను ఎంత ప్రేమగా చూసుకుంటుందో వివరించింది. తన అమ్మ.. అందరికీ అమ్మలాంటిందేనని కుక్కలతో ఆడుతున్న ఫోటోలను షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











