సెకండ్ ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు... ఫ్యాన్స్ ఫుల్ సర్ప్రైజ్!
టాలీవుడ్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో కలిసి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తుంది.తాజాగా తన కొత్త సినిమా సతీ లీలావతి (Sati Leelavathi)తో మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ సందర్భంగా యాంకర్ సుమ కనకాలతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో లావణ్య తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
లావణ్య మాట్లాడుతూ... మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని వెల్లడించారు. తీవ్రమైన వాంతులు, మైగ్రేన్ నొప్పులు, శారీరక అలసటతో పాటు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొన్నానని చెప్పారు. అయినా కూడా అప్పటికే కమిట్ అయిన 'సతీ లీలావతి' సినిమా షూటింగ్‌ను మధ్యలో ఆపకుండా పూర్తి చేశానని పేర్కొన్నారు.

'నిర్మాతలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో టాబ్లెట్స్ వేసుకుంటూ, భయాన్ని దాచుకుంటూ షూటింగ్ చేశాను. యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడేదాన్ని. ప్రతి షెడ్యూల్ తర్వాత హాస్పిటల్‌కు వెళ్లి చెకప్ చేయించుకునేదాన్ని,' అంటూ తన అనుభవాలను పంచుకున్నారు.
డ్యాన్స్ సీక్వెన్స్‌ల సమయంలో కొరియోగ్రాఫర్ ప్రత్యేకంగా స్టెప్స్ మార్చారని, బేబీ బంప్ కనిపించకుండా లూజ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారని లావణ్య తెలిపారు. మొదట్లో ఇంట్లో వాళ్లు కాస్త భయపడ్డా, భర్త వరుణ్ తేజ్ మాత్రం పూర్తి అండగా నిలిచారని చెప్పారు. 'సెట్‌లో ఎవరికీ నేను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పలేదు. తెలిసితే నన్ను వేరేలా చూస్తారేమోనని భయపడ్డాను. సాధారణ నటిలాగే పనిచేశాను' అంటూ ఆమె చెప్పిన మాటలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి.
ఇక బిడ్డ పుట్టిన తర్వాత తన జీవితమే మారిపోయిందని లావణ్య ఎమోషనల్‌గా చెప్పారు. 'గర్భధారణ సమయంలో పడ్డ కష్టాలన్నీ మర్చిపోయాను. మా కొడుకు వాయువ్ నా జీవితానికి కొత్త అర్థం తీసుకొచ్చాడు. తల్లి అయిన తర్వాత నా ఆలోచనలు, జీవనశైలి అన్నీ మారిపోయాయి'అని తెలిపారు.
అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం మాత్రం ఆమె చేసిన 'సెకండ్ ప్రెగ్నెన్సీ' కామెంట్స్. ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, భవిష్యత్తులో రెండో బిడ్డ గురించి కూడా ఆలోచించొచ్చనే స్థితిలో ఉన్నానని లావణ్య స్పష్టం చేశారు. అంతేకాదు..'ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ సినిమా చేశాను.. సెకండ్ ప్రెగ్నెన్సీలో పార్ట్-2 చేస్తానేమో!'అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు కామెంట్స్ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం లావణ్య వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడుపుతూనే, ప్రొఫెషనల్ కెరీర్‌లోనూ స్ట్రాంగ్ కంబ్యాక్‌కు సిద్ధమవుతున్నారు. 'సతీ లీలావతి' మార్చి 6న విడుదలకు రెడీ అవుతుండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆమె.. తల్లి అయిన తర్వాత కూడా సినిమాలపై తన డెడికేషన్ తగ్గలేదని మరోసారి నిరూపించారు. సెకండ్ ప్రెగ్నెన్సీపై లావణ్య ఇచ్చిన క్లారిటీతో మెగా ఫ్యాన్స్ ఫుల్ సర్ప్రైజ్ అయ్యారు. ఒకవైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ.. మరోవైపు కెరీర్‌ను సమర్థంగా బ్యాలెన్స్ చేస్తున్న లావణ్య త్రిపాఠి జర్నీకి అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











