అలాంటి వారిని దేశం నుంచి బహిష్కరించాలి.. పాకిస్తాన్ సపోర్టర్స్‌పై మెగా కోడలు నిప్పులు
ఇప్పుడు దేశం అంతా కూడా పహాల్గమ్ ఘటన ఉదంతం విషయంలో ఎలా రగిలిపోతుందో అందరికీ తెలిసిందే. కాగా ఈ ఘటన తర్వాత ఒక పాకిస్తాన్ దేశంలో ఉన్న వారే కాకుండా మన దేశంలోనే ఉంటూ ఇక్కడ ప్రభుత్వ సదుపాయాలు పొందుతూ మళ్ళీ పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్నవారు కూడా అనేకం ఉన్నారు. కాగా ఇలాంటి వారు అంతా షాకింగ్ గా పహాల్గమ్ ఘటన తర్వాత ఒకొకరిగా బయటకి వస్తున్నారు.
నిజానికి దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అలాగే పలు రాష్ట్ర సరిహద్దులో కూడా చాలామంది పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేవారు ఉన్నారని చాలా మందికి తెలుసు. కానీ మొన్న పహాల్గమ్ ఘటన తర్వాత పాకిస్తాన్ పై ఆగ్రహంతో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల అనేకమంది సినీ ప్రముఖులు కూడా మద్దతుగా నిలిచారు. అయితే పలు రాష్ట్రాల్లో పాకిస్తాన్ జెండాని నేలపై వేసి తొక్కడం వంటి ప్లాన్ మాత్రం ఊహించని రకంగా మారింది అని చెప్పాలి.

ఆ జెండాని నేలపై అంటించినందుకు చాలామంది మగవారికంటే చాలా మంది ఆడవాళ్లు అనూహ్యంగా వ్యతిరేకంగా స్పందించడం అనేది ఒకింత షాకింగ్ గా మారింది. కాగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది ఉత్తర భారతంలో కూడా చాలా మంది ఇస్లాం ఆడవారు పాకిస్తాన్ జెండాని కింద చూసి ఓర్వలేకపోవడం ఒకెత్తు అయితే వాటిని తీసి ఎందుకు తీస్తున్నారు అని అడుగుతున్న భారతీయులపై వాగ్వాదానికి కూడా వెళ్లడం మరొక ఎత్తు అని చెప్పాలి.
కాగా ఇలా జరిగిన ఓ షాకింగ్ ఘటనపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ క్లిప్ చూసి ఆగ్రహంగా ఈ రకంగా పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ మన జవానులు ప్రాణాలొడ్డి మరీ మన కోసం మన దేశాన్ని రక్షిస్తూ ఉంటే ఇక్కడ ఏమో మనకి హాని చేయాలని చూస్తున్నవారికి సపోర్ట్ చేస్తున్న వారిని చూసి అసహ్యం వేస్తుంది అని, ఇలాంటి వాళ్ళని మన దేశం నుంచి ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిన సమయం ఇదే అంటూ లావణ్య బదులిచ్చింది.
దీనితో తన సమాధానం ఇపుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ గా మారింది. దీనితో మెగా కోడలిపై అనేక ప్రశంసలు కూడా ఇపుడు వస్తున్నాయి. ఇక తన రిప్లైతో పాటుగా తన మరో మెగా మామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాకిస్తాన్ వారి పట్ల ఇక్కడే ఉండి ప్రేమ కురిపిస్తున్న వారిపై నిప్పులు చెరిగారు.
పాకిస్తాన్ అంటే అంతగా ఇష్టమున్నపుడు అలాంటి వారు అంతా అక్కడికే వెళ్ళిపోవాలి అని పవన్ చేసిన కామెంట్స్ కూడా నేడు వైరల్ గా మారాయి. ఇలా ఒకే కుటుంబం నుంచి ఒకే తరహా ఘటనపై ఈ తరహా రెస్పాన్స్ రావడం అనేది నెటిజన్స్ లో అలాగే సినీ వర్గాల్లో కూడా ఇపుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











