లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ? మెగా కోడలి శుభవార్త
తెలుగు ప్రేక్షకులకు అందాల రాక్షసి సినిమాతో ఎంతగానో వినోదాన్ని పంచింది నటి లావణ్య త్రిపాఠి. నార్త్ కు చెందిన లావణ్య సౌత్ కు చెందిన మెగా హీరోను పెళ్లి చేసుకొని ఇప్పుడు తెలుగువారి కోడలిగా మారిపోయింది. అది కూడా వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని మెగా కోడలిగా మారిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. పెళ్లికి ముందు సైన్ చేసిన కొన్ని చిత్రాలను మాత్రం పూర్తి చేసింది. ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించడం లేదు.
మెగా ప్రిన్స్, టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2017 లో మిస్టర్ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ చిత్రంతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచి డేటింగ్ చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే అంతరిక్షం 9000 కెఎంపిహెచ్ అనే చిత్రంలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. రిలేషన్ షిప్ లో ఉన్న వీరు 2023 జూన్ 9న ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అదే ఏడా ది నవంబర్ 1న ఇటలీలోని డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ టస్కానీలో వివాహం చేసుకున్నారు.

హిందూ సాంప్రదాయాల ప్రకారం పెద్ద సమక్షంలో వీరి పెళ్లి రంగరంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం అనంతరం ఓవైపు వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం మెగా కోడలుగా ప్రమోషన్ దక్కిన తర్వాత పెద్దగా సినిమాలకు సైన్ చేయలేదు. పెద్దగా ఆమె గురించి వార్త కూడా లేదు. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాటి పేరు మారుమోగిపోతుంది. అందుకు కారణం కూడా ఉందంటున్నారు.
లావణ్య త్రిపాఠి త్వరలో తల్లి కాబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఫిలిం సర్కిల్స్ లోను లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ తో ఉన్నారని రూమర్లు మాత్రం పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ అని వస్తున్నా వార్తల్లో నిజం ఎంత ఉన్నది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లావణ్య త్రిపాటి మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించక పోవడం గమనార్హం. దీంతో మరి కొద్ది రోజులు ఆగితే గాని అసలు విషయం తెలిసేలా లేదు.
చివరిగా మెగా కుటుంబంలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్, కొణిదెల క్లింకార అని నామకరణం కూడా చేశారు. ఇక లావణ్య త్రిపాఠి కూడా ప్రెగ్నెన్సీ అని ప్రచారం జరుగు తుండడంతో అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇక త్వరలో లావణ్య త్రిపాఠి పలు చిత్రాలను నటించ బోతున్నట్టు తెలుస్తుంది. తెలుగులో 'సతి లీలావతి', తమిళంలో 'థనల్' అనే చిత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











