నన్ను పెళ్లి చేసుకుంటావా?.. నెటిజన్ ప్రశ్నకు లావణ్య త్రిపాఠి రిప్లై అదుర్స్
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో తన అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో వెరైటీ ఫోటో షూట్‌లతో షాక్‌లు కూడా ఇస్తుంటుంది. అలా లావణ్య తన ఫాలోవర్లను పెంచుకుంటూ పోతోంది. ఇటు సినిమాలు అటు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ రెండూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా లావణ్య తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది.

సోషల్ మీడియాలో అలా..
లావణ్య త్రిపాఠి తెరపై ఎంత సైలెంట్‌గా ఉంటుందో.. సోషల్ మీడియాలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. అలాంటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో రూటు మార్చేసింది. హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది.

తాజాగా అలా..
లావణ్య ఓ వైపు అందాల ప్రదర్శన చేస్తూనే మరో వైపు ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతోంది. అలా తాజాగా లావణ్య తన అభిమానులతో సరదాగా కాసేపు చిట్ చాట్ చేసింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు లావణ్య ఎంతో ఓపిగ్గా సమాధానాలు చెప్పింది.

వాటిపైనే..
చావు కబురు చల్లగా చిత్రంలో పోషిస్తున్న మల్లిక పాత్ర, ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాలోని లావణ్య రావు క్యారెక్టర్‌ల గురించే ఎక్కువ మంది నెటిజన్లు ప్రశ్నలను సంధించారు. అలా లావణ్య ఈ రెండు చిత్రాల గురించి, తన పాత్రలకు ఉన్న ప్రాధాన్యం గురించి చెప్పుకొచ్చింది.

అభిరుచులు..
అభిరుచుల విషయాలను కూడా అభిమానులు అడిగారు.. ఏ ప్లేస్ అంటే ఇష్టం.. ఏ ఫుడ్ అంటే ఇష్టం అంటూ ఇలా రకరకాలుగా అడిగేశారు. రాగి సంగటి, పప్పు అంటే ఎంతో ఇష్టమంటూ లొట్టలేసుకుంటూ మరీ తన ఇష్టాలను బయటపెట్టేసింది లావణ్య.

పెళ్లి చేసుకుంటావా?
ఐ లవ్యూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ఓ నెటిజన్ నేరుగా ప్రపోజ్ చేసేశాడు. దీనికి లావణ్య ఎంతో హుందాగా స్పందించింది. మీరు ప్రపోజ్ చేసినందుకు.. ప్రేమిస్తున్నందుకు థ్యాంక్స్.. కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అంటూ నొప్పించకుండా సమాధానాన్ని చెప్పేసింది.


Click it and Unblock the Notifications











