లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి.. మెగా కోడలు ఏం చెప్పిందంటే?
ఇటీవల కాలంలో సెలబ్రిటీల అనారోగ్యాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగాక.. తమలోని సమస్యలు, వ్యాధులను ఓపెన్ గా చెప్పేందుకు ముద్దుగుమ్మలు ఏమాత్రం సంకోచించడం లేదు. స్టార్ హీరోయిన్ సమంత మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అలాగే పూనమ్ కౌర్ వంటి తదితర హీరోయిన్లు సైతం తమకున్న అనారోగ్య సమస్యలు చెప్పుకొచ్చారు. తాజాగా మెగా ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టనున్న బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి తనకున్న అరుదైన వ్యాధి గురించి చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తండ్రి కోరకతో:అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ కు చెందింది. చిన్నప్పటి నుంచి గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని కలలు కన్న ఈ బ్యూటి తన తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్, టీవీ కార్యాక్రమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం సైతం గెలుచుకుంది. అలా మోడలింగ్ తర్వాత అందాల రాక్షసితో తెలుగు చిత్ర సీమకు హీరోయిన్‌గా పరిచయం అయింది.

వరుస విజయాలు:తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి. తర్వాత అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ అందుకుంది. దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. దీంతో లావణ్య పేరు మారు మోగిపోయింది.
వెంటనే ప్లాపులు:అయితే లచ్చిందేవికి ఓ లెక్కుంది, రాధ, ఇంటలిజెంట్, యుద్ధం శరణం, మిస్టర్, అంతరిక్షం, అర్జున్ సురవరం, ఏ1 ఏక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే వంటి చిత్రాలు మాత్రం ప్లాప్ అయి లావణ్య త్రిపాఠిని వరుసగా నిరాశపరిచాయి. కాగా మిస్టర్ సినిమాతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో రూమర్స్ తర్వాత వీరి లవ్ ట్రాక్ ను అధికారికంగా నిశ్చితార్థంతో ప్రకటించారు.

వింత ఆకారాలు:ఇదిలా ఉంటే ఎంతో క్యూట్ గా ఉండే సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి ఉందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో లావణ్య ట్రిపోఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు, దాన్ని నుంచి బయటపడేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

వైరల్:ట్రిపోఫోబియా అంటే ఏదైన వింత ఆకారాలను, వింత వస్తువులు, రంధ్రాలు ఉన్న, గడ్డలు కట్టిన వస్తువులను చూసి భయపడటం. సాధారణంగా వింత ఆకరాలను చూసి ఎవరైనా భయపడతారు. కానీ లావణ్య కాస్తా ఎక్కువగా భయపడతారట. రెండేళ్ల క్రితం ఇంటర్వ్యూలో ట్రిపో ఫోబియా ఉందని చెప్పిన లావణ్య త్రిపాఠి మాటలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

నేను ఏం చేయాలి:అయితే తనకు ట్రిపోఫోబియా అనే వార్తలపై కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి తాజాగా స్పందించింది. "నాకు వింత వ్యాధినా.. నాకు తెలిసినంత వరకు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు నేను మిమ్మల్ని ఏం చేయాలి" అని తెలిపినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











