మా నాన్న లాంటి వాడిని చూశాను.. అంతరిక్షంలో లావణ్య త్రిపాఠి పాత్ర ఇదే!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం చిత్రం డిసెంబర్ 21న విడుదలకు సిద్ధం అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ నెల 9న అంతరిక్షం ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. అంతరిక్షం ట్రైలర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో విజువల్స్ ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.
ఇదిలా ఉండగా ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి పాత్రని రివీల్ చేస్తూ ఓ ఆడియో విడుదలచేశారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి పాత్ర పేరు పార్వతి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కూతురిగా కాదు.. పార్వతి టీచర్ గా నాకు గుర్తింపు ఉంది. గోల్ ఓరియెంటెడ్.. ఇండిపెండెంట్ పీపుల్ అంటే నాకు ఇష్టం. నా 24ఏళ్ల జీవితంలో మా నాన్న లాంటి వ్యక్తిని చూస్తానా అని అనుకున్నా.. చూశాను.. దేవ్ కి దేశం మీద ఎంత ప్రేమ ఉందో తనపై నాకు అంత ప్రేమ ఉంది అంటూ లావణ్య పాత్రకు సంబంధించిన డైలాగులని రివీల్ చేశారు.

ఈ చిత్రంలో లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ ప్రేయసిగా,టీచర్ గా నటిస్తున్నట్లు అర్థం అయిపోతోంది. వరుణ్ తేజ్, అదితి రావు హైదరి వ్యోమగాములుగా నటిస్తున్నారు. అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











