భలే కవర్ చేసిందిగా.. లావణ్య త్రిపాఠి డ్రెస్సింగ్‌పై హర్టైన నెటిజన్స్

హీరోయిన్ డ్రెస్సింగ్‌పై ఎప్పుడూ వివాదం జరుగుతూనే ఉంటుంది. తమ అభిమాన హీరోయిన్లు అభ్యంతరకర దుస్తులు ధరించడంతో అభిమానులు హర్ట్ అవుతుంటారు. అలాంటి క్యాస్టూమ్‌ను ధరించినా, ఫోటోలను షేర్ చేసినా తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతుంటారు. అయితే వాటికి కొందరు హీరోయిన్లు పరిగణలోకి తీసుకుంటారు. మరికొందరు అసలు పట్టించుకోరు. ఇక అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలోకి వదిలితే ఎటువంటి కామెంట్స్ వస్తాయో అందరికీ తెలిసిందే. తాజాగా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఓ ఫోటోను చూసి ఆమె అభిమానులు తెగ హర్ట్ అయినట్టు కనిపిస్తోంది.

క్వారంటైన్‌లో అలా..

క్వారంటైన్‌లో అలా..

చుట్టుపక్కల వారి సాయంతో మాస్కులు తయారు చేస్తున్నానని, అవసరమైన వారికి వాటిని అందజేస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో దాదాపు 300 మాస్కులను పంజాగుట్ట పోలీసులకు అందజేసినట్టు పేర్కొంది. తన చేతనైన సాయం చేస్తున్నట్టు తెలిపింది.

సీసీసీకి విరాళం..

సీసీసీకి విరాళం..

సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించాడు. ఈ మేరకు సినీ సెలెబ్రిటీలంతా తమకు తోచిన సాయాన్ని విరాళంగా ఇవ్వాలని కోరాడు. అయితే హీరోలందరూ స్పందించగా.. హీరోయిన్లు మాత్రం తక్కువ సంఖ్యలో ముందుకు వచ్చారు. అందులో లావణ్య త్రిపాఠి ఒకరు. సీసీసీకి లావణ్య లక్ష రూపాయల విరాళాన్ని ఇచ్చింది.

బోల్డ్ పాత్రలకు సిద్దం..

బోల్డ్ పాత్రలకు సిద్దం..

నటిగా తానేంటో నిరూపించుకోవాలంటే అన్ని రకాల పాత్రలను చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. కథ డిమాండ్ చేస్తే బికినీ కూడా ధరిస్తానని, రొమాంటిక్ సీన్స్ కూడా చేస్తానని తెలిపింది. దీనికి తగ్గట్టుగానే కొన్ని రోజుల నుంచి లావణ్య ఫోటోలతో దాడి చేస్తోంది.

తాజా ఫోటో వైరల్..

తాజా ఫోటో వైరల్..

వరుసగా ఫోటోలను షేర్ చేస్తున్న లావణ్య.. నేడు ఓ పిక్‌ను పోస్ట్ చేసింది. అయితే అందులో లావణ్య తన తెలివిని ప్రదర్శించింది. బుల్లి నిక్కరు వేసుకున్నట్టు ఉన్న లావణ్య అదేమీ కనిపించకుండా మోకాళ్లను అడ్డుపెట్టి అది కూడా బ్లర్ చేసినట్టు చేసి ఓ ఫోటోను షేర్ చేసింది.

హర్టైన ఫ్యాన్స్

హర్టైన ఫ్యాన్స్


అయితే ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఆమె నవ్వుకు, సొట్టబుగ్గలకు ఫిదా అయ్యారు. కొంతమంది ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇలాంటి ఫోటోలను పెట్టకండి, ఇలాంటి బట్టలు ధరించకండి, మీరు చీరలో బాగుంటారు అని సలహాలు ఇస్తున్నారు. మరి వీటిని లావణ్య పరిగణలోకి తీసుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X