ప్రతీ వారం ఆ పని చేయాల్సిందే..మెగా కోడలు వీడియో వైరల్
మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. స్టార్ హీరోలతో నటిస్తూ మంచి పాపులర్టీ దక్కించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
యూపీకి చెందిన లావణ్య త్రిపాఠి మోడలింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. 2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది.

ఇటీవల వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లీ చేసుకుని.. మెగా కోడలిగా తెలుగు ప్రేక్షకులను మరింత దగ్గరైంది. వరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే.. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలో తగ్గించిందని చర్చ జరుగుతుంది. దానికి కారణం ఆమె ఇటీవల ఏ సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే.ఇటీవల లావణ్య.. మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది ఆ వీడియోలో ప్రతివారం తమ కుటుంబం అంతా కలిసి ఇలా వండి ఫుడ్ ప్యాక్ చేసి అవసరమైన వారికి అందిస్తాం అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇలా ఇవ్వడం గొప్ప విషయం అనుకోవడం లేదు. కానీ, ఇలా ఇచ్చినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. అందరికీ ప్రేమ పంచడం అనేది గొప్ప విషయం అన్నట్లు లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు.
ఈ వీడియోలో లావణ్య తన అత్త,నాగబాబు భార్యతో వంట చేస్తూ ఉండగా.. కొందరు ఫుడ్ ఫ్యాక్ చేస్తున్నారు. ఈ వీడియోను లావణ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో పై మెగా అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మెగా కోడలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగా ఫ్యామిలీది గొప్ప మనసు అని మరోసారి చాటుకున్నారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











