సునిశిత్ యవ్వారంపై లావణ్య త్రిపాఠీ షాకింగ్ ఆన్సర్.. ఆ విషయం బయటకు రాకుండా..
సెలబ్రెటీలపై ఎలాంటి కామెంట్స్ చేసినా సెలబ్రెటీ కావచ్చు అనే ఆలోచనలు ఈ మధ్య చాలా పెరుగుతున్నాయి. వారిని తిడితే సేఫ్ జోన్ లో ఈజీగా సెలబ్రెటీలుగా మారవచ్చు అని కొందరు అదే పనిగా పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు. అయితే ఆ పిచ్చి డోస్ రోజురోజుకి మరీంతగా పెరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విదంగా ఇంటర్వ్యూలలో కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

లావణ్య త్రిపాఠిపై కామెంట్స్..
గత కొన్ని రోజుల క్రితం శ్రీరామోజు సునిశిత్ అనే యువకుడు లావణ్య త్రిపాఠిపై పలు రకాల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమెతో ఎఫైర్ ఉందని ఇంటర్వ్యూలలో పదే పదే చెబుతుండడం ఒక్కసారిగా మీడియాలో వైరల్ అయ్యింది. కొన్నాళ్లపాటు ఆమెతో డేటింగ్ చేసినట్లు చెప్పిన సునిశిత్ రీసెంట్ గా బ్రేకప్ అయినట్లుగా కూడా చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఆగ్రహించిన అందాల రాక్షసి..
సునిశిత్ ఇష్టం ఉన్నట్లుగా కామెంట్స్ చేయడంతో విషయం తెలుసుకున్న లావణ్య త్రిపాఠి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత సునిశిత్ పెద్దగా స్పందించలేదు. హీరోయిన్ తో పెళ్లి అయినట్లు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని హడావుడి చేసిన సునిశిత్ పోలీస్ కేసు తరువాత మళ్ళీ కనిపించలేదు.

లావణ్య షాకింగ్ ఆన్సర్..
ఈ వివాదంపై ఇంతవరకు లావణ్య త్రిపాఠి ఎక్కడా కూడా స్పందించలేదు. ఇక ఇటీవల ఒక వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు ముందుగానే సునిశిత్ విషయంపై ఎలాంటి ప్రశ్నలు వేయవద్దని షాకింగ్ ఆన్సర్ ఇచ్చిందట. మళ్ళీ ఆ విషయం బయట హాట్ టాపిక్ అవ్వకూడదని.. కేవలం తన సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే వేయాలని, అనవరమైన విషయాల గురించి సమయం వృధా చేయలేనని చెప్పిందట.

బోల్డ్ క్యారెక్టర్స్ కోసం వెయిటింగ్..
ఇక అందాల రాక్షసి ఎక్కువగా వివాదాల్లోకి వెళ్లకూడదని తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పింది. బోల్డ్ పాత్రల్లో కనిపించడానికి తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ తమిళ్, మలయాళం సినిమాలతో పాటు తెలుగులో కార్తికేయతో 'చావు కబురు చల్లగా' అనే సినిమాతో బిజీ కానుందట.


Click it and Unblock the Notifications











